కంగనా రనౌత్ కు మరోషాక్… కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ ఆదేశం.

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మరోసారి షాక్ తగిలింది. ఆమె పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. స్వాతంత్య్రం పై కంగానా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది కోమిరెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దేశప్రజల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యానించిందని పిటీషన్ దాఖలైంది. అయితే దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోర్ట్ పోలీసులును ఆదేశించిది.కాగా ఇటీవల కంగనా స్వాత్రంత్య్రం భిక్షగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి పక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. రైతు ఉద్యమాన్ని ఖలిస్తాన్ ఉద్యమంగా అభివర్ణించడం కూడా వివాదాస్పదం అయింది. దీంతో సిక్కుల మతస్థుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ఉద్దేశపూర్వకంగా ఒక మతాన్ని కించపరిచిందని.. పలువురు కేసులు కూడా నమోదుచేశారు. ఇటీవల ముంబైలో ఓ కేసు నమోదైంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కూడా కంగనాకు సమన్లు జారీ చేసింది. ఖలిస్తాన్ ఉద్యమం వ్యాఖ్యలపై తమ ముందు హాజరు కావాాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version