భువనేశ్వరి ఇష్యూ: స్పీకర్ కొత్త ట్విస్ట్..

-

ఇటీవల ఏపీ రాజకీయాలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. పలువురు వైసీపీ నేతలు భువనేశ్వరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆ విషయంపై చంద్రబాబు కన్నీరు పెట్టడం జరిగాయి. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలని పార్టీలకు అతీతంగా నాయకులు ఖండిస్తూ…చంద్రబాబుకు మద్ధతు ప్రకటించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తాము భువనేశ్వరిని ఏమి అనలేదని, చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు.

అయితే నెల రోజుల క్రితం వల్లభనేని వంశీ…లోకేష్‌కు మాధవ రెడ్డి పోలికలు ఎలా వచ్చాయని, మాధవ రెడ్డి హత్య ఎలా జరిగిందని ప్రశ్నించారు. దీని బట్టి చూస్తే భువనేశ్వరిపై ఎలా అసభ్యంగా మాట్లాడారో అర్ధమవుతుంది. ఇక ఇటీవల అసెంబ్లీలో కొడాలి నాని, అంబటి రాంబాబులు మాధవరెడ్డి హత్య అంటూ పరోక్షంగా బాబు భార్య భువనేశ్వరి గురించి కామెంట్ చేశారు. అయితే మైక్‌లో కాకుండా…వెనుక కూర్చుని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి…లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా చంద్రబాబు అని మాట్లాడటం…డి‌ఎన్‌ఏ టెస్ట్ చేయించుకో అని మాట్లాడిన వాయిస్ బయటకొచ్చింది.

ద్వారంపూడి మాటలు…టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్లలో రికార్డు చేసిన వీడియోల్లో వినిపించాయి. అందుకే వైసీపీ నేతలు…భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడారనే విషయం బయట ప్రజలకు అర్ధమైంది. ఇప్పటికీ ఈ విషయంలో వైసీపీ నేతలు కవర్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ వారు మాట్లాడిన మాటలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఇలా నేతలు నోరు జారి…పరోక్షంగా వైసీపీకి డ్యామేజ్ చేసినట్లు అయింది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు. అంటే ఇంకా సభలోకి ఫోన్లు తీసుకెళ్లడానికి ఛాన్స్ లేదు. అయితే భువనేశ్వరి ఇష్యూకు సంబంధించే స్పీకర్ ఈ రూలింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version