మరోసారి రష్మిక పరువు తీసేసిన కాంతారా హీరో..!

-

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా.. హీరోగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాంతారా సినిమాతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈయన ఒక కన్నడ ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ ఆదరణ సంపాదించుకున్నారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డుల నామినేషన్ లో ఉండడం గమనార్హం . ఇలా కాంతారా సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి రష్మికను మీడియా వారు ప్రశ్నించడంతో ఆమె సినిమా చూడలేదంటూ చెప్పిన సమాధానం నిజంగా కన్నడ ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

ఈ క్రమంలోనే అటు రష్మిక.. ఇటు రిషబ్ శెట్టి మధ్య ఇంటర్నల్ వార్ జరుగుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడివిడిగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఒకరిపై మరొకరు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. మొన్నటి వరకు పరోక్షంగా రష్మికాను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసిన రిషబ్ శెట్టి.. ఇప్పుడు మరొక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమెను ఉద్దేశిస్తూ కామెంట్లు చేయడం ఇప్పుడూ హాట్ టాపిక్ గా మారింది. రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. మేము ఇండస్ట్రీకి ఎంతోమంది సెలబ్రిటీలను లాంచ్ చేసాము. చాలామంది దర్శక నిర్మాతలు మాకు అవకాశాలు కల్పించారు. అలాంటి వారి లిస్ట్ మా దగ్గర ఎక్కువగానే ఉంది అంటూ ఆయన కామెంట్ చేశారు.

గతంలో రిషబ్ శెట్టి లో ఇండస్ట్రీకి లాంచ్ చేసిన వారిలో రష్మిక కూడా ఒకరు. ఈమె నటించిన మొదటి చిత్రం కిరిక్ పార్టీ సినిమాకు దర్శకుడు కూడా ఈయనే కావడం గమనార్హం. ఇలా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఉద్దేశించి రిషబ్ శెట్టి పరోక్షంగా రష్మిక గురించి మాట్లాడారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version