ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే మాట కాంతార. కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భాషని మరిచి అన్ని భాషల వారు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. బ్యానర్.. ప్రొడ్యూసర్.. ఇలా కాంబినేషన్ చూసుకుని సినిమాలకు వెళ్లే వారు కూడా కేవలం కాంతార సినిమా గురించి వచ్చిన మౌత్ టాక్ తో ఈ చిత్రం చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదని ‘కాంతార’ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాని థియేటర్స్‌లో చూడలేకపోతున్న ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తోందా అని ఎదురుచూస్తున్న వాళ్లకి ఓ గుడ్ న్యూస్.నవంబర్ 4 శుక్రవారం నాడు ‘కాంతార’ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’లో రిలీజ్ చేశారు. అరవింద్‌కి ‘ఆహా’ సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉంది. మరి ‘కాంతార’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా కూడా పంచుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.