పాక్‌ క్రికెట్‌ బోర్డుకు అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్

-

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌తో పాటు అన్ని పెద్ద జట్లు పాల్గొంటాయని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఓ హెచ్చరిక చేసింది. ఇండియాలో జరిగే వరల్డ్‌కప్‌లో తాము ఆడబోమని చెప్పింది.

భారత్‌ అతి పెద్ద క్రీడా దేశమని, ఇక్కడ ఎన్నో ప్రపంచ కప్‌లు జరిగాయని, ఇండియాలో వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరుగుతుందని, ప్రపంచంలోని అన్ని పెద్ద జట్లు ఆ టోర్నీలో పాల్గొంటాయని, ఏ క్రీడలోనూ ఇండియాను విస్మరించలేరని, క్రీడలకు ఇండియా ఎంతో చేసిందన్నారు. క్రికెట్‌కు భారత్‌ మరీ ఎక్కువే చేసిందని చెప్పారు.

వచ్చే ఏడాది వరల్డ్‌ కప్‌ నిర్వహిస్తామని, ఆ టోర్నీని చరిత్రాత్మక రీతిలో నిర్వహిస్తామని, పాక్‌లో భద్రతా పరమైన సమస్యలున్నాయని, దానిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని, క్రికెట్‌ మాత్రమే కాదు, ఇండియా ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదని మంత్రి ఠాకూర్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news