ప్రపంచం మెచ్చిన సినిమాలలో కాంతారా సినిమా కూడా ఒకటి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఏ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే, చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన కాంతారా సినిమా ఆస్కార్ అవార్డులకు క్వాలిఫై అయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించే 95 వ ఆస్కార్ అవార్డులకు కాంతారా కూడా నామినేషన్ లో చేర్చాలని హోంబలే ఫిలిమ్స్ అప్లికేషన్ పంపింది. ఇప్పుడు రెండు మీ భాగాల్లో క్వాలిఫై అయినట్లు ఆ సంస్థ తెలిపింది.