పదవీ విరమణ తర్వాత హ్యాపీ లైఫ్ ని పొందాలంటే ఇలా చెయ్యాల్సిందే..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా రాదు. పదవీ విరమణ తర్వాత ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు కూడా అవుతుంది. సంపాదించేటప్పుడే పొదుపు చేసుకోవాలి అని గుర్తు పెట్టుకోండి.

25 ఏళ్ల వయస్సులో వారు నెలకి రూ. 10,000 చొప్పున పొదుపు చేస్తే 7 శాతం వార్షిక వడ్డీతో ఆ వ్యక్తి 60 ఏళ్లు వచ్చే సరికి రూ.45 మిలియన్లు ఉంటాయి. 35 ఏళ్ల దాకా చుస్తే రూ.18 మిలియన్లు మాత్రమే ఉంటాయి. చూసారా ఎంత తేడా వస్తోందో. అందుకే మనం సంపాదిస్తున్నప్పుడే పొదుపు చేసుకోవాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ వంటి స్కీమ్స్ వున్నాయి కనుక వీటిలో మీరు డబ్బులు పెట్టి ఆదా చెయ్యచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఓ మంచి ఆప్షన్ ఏ. సంప్రదాయ పెట్టుబడి పథకాలతో పోలిస్తే ఎక్కువ వస్తుంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌ లో కాస్త రిస్క్ ఉంటుంది. కనుక చూసుకోండి. అయితే చాలా మంది ఇప్పుడెందుకులే తరవాత చూసుకుందాం అని సేవింగ్స్ ఏమి చెయ్యరు. అలా చెయ్యడం వలన తక్కువ మాత్రమే సేవ్ చేసేందుకు అవుతుంది. కనుక ఎవరైనా సరే జాబ్ వచ్చాక మొదట సేవింగ్స్ కోసం ఆలోచించండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ వంటి స్కీమ్స్ ద్వారా మీరు మీ డబ్బులని సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు పదవీ విరమణ తర్వాత ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version