కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కాంతారా. దేశవ్యాప్తంగా పలు సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు కూడా పొందింది భాషతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగ రాసిన ఈ సినిమా కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు ఆ పాత్రలో రిషబ్ నటన అందరిని మెస్మరైజ్ చేసింది. అయితే ఇంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మాత్రం ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. అయితే దీనిపై తాజాగా నిర్మాత విజయ్ కిరంగదూర్ కాంతారా 2 కు ఆస్కార్ అవార్డు లేదా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు..
ప్రస్తుతం కోవిడ్ సమయం నుంచి ఓటీటీ కి ఆదరణ బాగా పెరిగింది. విభిన్న నేపథ్యాల సినిమాలు, వెబ్ సిరీస్ లను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. వారు ఇప్పటివరకు చూడని కంటెంట్ ను అందించడమే ఇప్పుడు దర్శక నిర్మాతలు ముందున్న ప్రధాన లక్ష్యము. మనం మన మూలాల్ని ప్రపంచానికి తెలియచేయాలి. కాంతారా ద్వారా కూడా అదే జరిగింది. సినిమాలే కాకపోయినా కనీసం డాక్యుమెంటరీ రూపంలో అయినా సరే మన సంస్కృతిని తెరపైకి తీసుకురావాలి. కాంతారా వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కర్ణాటకలోని తుళు నాడు ఆచారం గురించి తెలుసుకున్నారు. అందుకే ఇకపై అలాంటి కథలతోనే మీ ముందుకు వస్తాము అంటూ విజయ్ తెలిపారు.
2022 సెప్టెంబర్ లో విడుదల కావడం వల్లే అంతర్జాతీయ స్థాయిలో కాంతారా ను ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ కాలేదని తెలుస్తోంది. ఆ లోటును కాంతారా 2 తీర్చేలా శ్రమిస్తాము అంటూ ఆయన తెలిపారు.