రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది : బండి

-

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలకు కప్పం కట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం సాధించేదేమిటి అని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రతి పనికి, బిల్లుకు 14 శాతం కమీషన్లు దొబ్బుకోవడమే పనిగా పెట్టుకున్నరు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. ఆరోగ్య శ్రీ బకాయిలు కట్టడం లేదు. ఇగ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది. ఈ మధ్య హైదరాబాద్ లో రెయిన్ బో ఆసుపత్రిలో రోగులు చేరితే లక్షల రూపాయలు బిల్లుల పేరుతో దోచుకుంటున్నరు. ఇదేం దోపిడీ.

చిన్న చిన్న రోగాలకు కూడా లక్షల బిల్లులు వేసి ప్రజల రక్తం పీలుస్తున్నరు. అయినా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని అడిగారు. అలాగే ప్రజలను.. వాస్తవాలు గమనించాలని కోరుతున్నా… కాంగ్రెస్ అభయ హస్తమంటేనే భస్మాసుర హస్తం. కాంగ్రెస్ కు గుణపాఠం చెబితేనే ఆ పార్టీకి బుద్ది వస్తది… అట్లాగే ఆర్ధిక పరిస్థితి తెలిసే కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చినందున ఆ హామీలను అమలు చేసేదాకా కొట్లాదాం అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news