కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..7 గురికి సోకిన వైరస్

-

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నసమయంలో మరో ముప్పు ఇండియాను భయపెడుతోంది. కరోనా తనను తాను మార్చుకొని కొత్త వేరియంట్ల రూపంలో గుబులు పుట్టిస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ భయటపడింది. ఆ రాష్ట్రంలో 7గురికి ఏ.వై4.2 రకం వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏ.వై 4.2 రకం సోకిన 7గురిలో ముగ్గరు బెంగళూర్ నగరానికి చెందిన వారు కాగా మిగతా వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ వేరియంట్ సోకిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ.వై. 4.2 రకం అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. బెంగళూర్ లోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ కు నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. జన్యు పరీక్షలు చేసేందుకు కర్ణాటక రాష్ట్రంలో ఆరు లేదా ఏడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version