తుంగభద్ర డ్యామ్ ఘటనపై సీఎం సిద్ధరామయ్య వివరణ..!

-

70 ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఇలా నీటి ప్రవాహానికి గేటు కొట్టుకుపోవడం ఇదే తొలిసారి అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. అయితే గేట్ తయారీ ఇప్పటికే పూర్తయింది. రేపటి నుంచి గేటు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి కన్నయ్య నాయుడు తదితరుల బృందం పనులు చేస్తున్నాయి. ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు నేతృత్వంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసుకోవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి గేట్ మార్చాలి. ఇక నుంచి నిపుణులు చెప్పినట్లుగా రిజర్వాయర్‌ను నిర్వహించనున్నారు. నీటిని పొదుపు చేయాలి. రైతులకు రక్షణ కల్పించాలి. ప్రస్తుతం మొదటి పంటకు ఇబ్బంది లేదు.. రెండో పంట గురించి చూద్దాం. గేటు వేసినా 63 టీఎంసీల నీరు మిగిలి ఉంటుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదటి పంటకు సరిపడా నీరుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నేతలు కలిసి చర్చించారు. రిజర్వాయర్ సమస్యను రాజకీయం చేయొద్దు. నాలుగైదు రోజుల్లో గేట్‌ను అమర్చవచ్చు. వర్షం కురిస్తే జలాశయం నిండుతుందని అధికారులు భావిస్తున్నారు అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news