కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తెల్లారే… స్పీకర్.. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. తాజాగా.. ఇవాళ 14 మందిపై అనర్హత వేటు వేయడంతో.. ఈ సంఖ్య 17కు చేరుకున్నది.
కర్ణాటకలో మరో ట్విస్ట్. రాజీనామా చేసిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు కుప్పకూలిపోయాక… శుక్రవారం సాయంత్రం 6.30కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీజేపీ ప్రభుత్వం సభలో బల నిరూపణ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయం అన్యూహ మలుపు తిరిగింది.
కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తెల్లారే… స్పీకర్.. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. తాజాగా.. ఇవాళ 14 మందిపై అనర్హత వేటు వేయడంతో.. ఈ సంఖ్య 17కు చేరుకున్నది. వీళ్లలో ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కాగా… 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.
అయితే… రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం… బీజేపీకి కలిసొచ్చే విషయమే. నిజానికి.. బీజేపీకి సభలో నిరూపించుకోవడానికి మెజారిటీ లేదు. బీజేపీకి ఉన్నది 105 మంది సభ్యులే. ఇప్పుడు 17 మంది సభ్యులపై వేటు పడటంతో… కర్ణాటక అసెంబ్లీ సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది.
అంటే.. మ్యాజిక్ ఫిగర్ 104. బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఈజీగా విశ్వాస పరీక్షలో బీజేపీ నెగ్గనుంది.
ఇక.. అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీళ్లే…
కాంగ్రెస్
బస్వరాజు
మునిరత్నం
సోమశేఖర్
రోషన్‌బేగ్
ఆనంద్‌సింగ్
నాగరాజు
బీసీ పాటిల్
ప్రతాప్ గౌడ్
సుధాకర్
శివరాం హెబ్బర్
మంత్ పాటిల్
రమేష్ జార్జ్‌హోళి
మహేష్
జేడీఎస్
గోపాలయ్య
నారాయణ గౌడ్
విశ్వనాథ్
శంకర్(స్వతంత్ర)