కరోనా టెస్టుకు.. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.650 వసూలు..

-

దేశంలోనే ఎక్కడా లేని విధంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికుల నుంచి కరోనా శాంపిల్స్‌ను సేకరించి వాటిని ప్రైవేటు ల్యాబుల్లో టెస్టు చేసేందుకు గాను ప్రయాణికుల నుంచి ఒక్కొక్కరికి రూ.650 ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం 5 శాంపిల్స్‌ను కలిపి ఒక పూల్‌గా చేసి టెస్టు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.

కరోనా పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ ఏది వచ్చినా సరే.. ప్రయాణికులు ఒక్కొక్కరు శాంపిల్స్‌ టెస్ట్‌కు రూ.650 చెల్లించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక పూల్డ్‌ శాంపిల్స్‌లో నెగెటివ్‌ వస్తే ఓకే.. అదే పాజిటివ్‌ వస్తే మాత్రం ప్రయాణికుల శాంపిల్స్‌ను ప్రత్యేకంగా సేకరించి వాటిని మళ్లీ విడివిడిగా టెస్టు చేయనున్నారు. దీంతో ఏయే ప్రయాణికులకు కరోనా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. దీని వల్ల ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతాయి.

కాగా దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఉచితంగా కరోనా టెస్టులను నిర్వహిస్తున్నాయి. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు పూల్డ్ టెస్టింగ్‌ చేస్తున్నామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version