కార్తీకదీపం ఎపిసోడ్ 1180 : చావుబతుకులమధ్య బయటపడ్డ నిజం..మోనిత గర్భం కృత్రిమం కాదట..!

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కు భారతి ఫోన్ చేసి..మోనితకు నొప్పొలొచ్చాయ్, తన కండీషన్ చాలా సీరియస్ గా ఉంది అంటుంది. కార్తీక్ నాకెందుకు చెప్తున్నావ్ నాకేం అవసరం లేదు అంటాడు. బిడ్డమెడకు పేగు చుట్టుకుని ఉంది నువ్వు వచ్చి సంతకంపెడితే కానీ ఆపరేషన్ చేయించుకోను అంటుంది. చస్తే ఛావని అని కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. విషయం పక్కనే ఉన్న సౌందర్యకు చెప్పి..ఏంటి మమ్మీఇది..ఇదేం తలనొప్పినాకు అంటాడు. ఇంతలో దీప కాఫీ తీసుకుని వస్తుంది. సౌందర్య కార్తీక్ ను ఆపుతుంది. ఇద్దరు టాపిక్ మార్చేస్తారు. దీపకు అర్థమవుతుంది..నేనురాగానే ఏదో మాట్లాడుకునే మీరు మాట మార్చేశారు..నాకు అర్థమయిపోయింది అనుకుని కాఫీ ఇచ్చేసి వెళ్లిపోతుంది. మళ్లీ భారతి ఫోన్ చేస్తుంది.. ఈ సారి ఫోన్ సౌందర్య తీసుకుంటుంది. భారతి ఏదో సోది చెప్పి సౌందర్యను కన్విన్స్ చేస్తుంది. ఇదంతా మోనిత ప్లాన్ లో భాగమే అయిఉంటుంది. సౌందర్య భారతి మాటలకు కరిగిపోతుంది. తనుచేసిన పాపాలకు పసిబిడ్డకు శిక్షఎందుకురా..చూస్తూ చూస్తూ కడుపులో ఉన్న పసిప్రాణాన్ని అలాఎలా వదిలేస్తాంరా అంటుంది. కార్తీక్ కి కాలిపోతుంది..అక్కడినుంచి వెళ్లిపోతాడు.

హాస్పటల్ లో మోనిత కార్తీక్ రావాలి, నా భర్తగా సంతకం చేయాలి అప్పుడే ఇంజన్షన్ చేయాలి అంటుంది. భారతి పల్స్ రేట్ పడిపోతుందని ఇంజన్షన్ చేస్తాఅంటే మోనిత ఒప్పుకోదు. అయినా భారతి బలవంతంగా ఇంజన్షన్ చేసి ఆపరేషన్ చేయొచ్చుగా చేయదు..మళ్లీ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. సౌందర్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. భారతి..సెంటిమెంట్ డైలాగ్స్ వేస్తుంది. కడుపులో పేగు చుట్టుకుంది. అది కీడు కూడా అంటారుగా, ఎంతకాదనుకున్నా మీ ‌వంశాంకురమేగా అని చెప్తూ ఉంటుంది. ఇంతలో దీప వస్తుంది. సౌందర్య ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి అత్తయ్య ఇక్కడ ఉన్నారు అంటే కాఫీకోసం వచ్చానే అంటుంది. దీపకు అనుమానం మొదలవుతుంది. హిమకు బ్లడ్ టెస్ట్ చేయించాను కదా ఆ రిపోర్ట్స్ తెస్తాను అంటుంది. సౌందర్య ఏం మాట్లాడదు. ఏంటి అత్తయ్య హిమగురించి మాట్లాడినా ఉలుకుపలుకులేదు అనుకుంటుంది. మళ్లీ భారతి వీడియోకాల్ చేస్తుంది. సౌందర్య లిఫ్ట్ చేసి కార్తీక్ కు చూపించటానికి తీసుకెళ్తుంది.

ఇంకోపక్క శౌర్య, హిమలు మాట్లాడుకుంటూ ఉంటారు. హిమ మొత్తానికి డాడీ మంచోడే అనుకుంటా..ఒకవేళ డాడీ తప్పుుచేస్తే అమ్మ ఇక్కడే ఉండదుకదా అంటుంది. హిమ రియలైజ్ అవుతుంది. శౌర్య నాన్న రాగానే సారీ చెప్తావా మరీ అంటుంది. హిమ సరే అంటుంది. ఇలా వీళ్లు లైన్ లో పడుతున్నారు అనుకుంటే…కార్తీక్ ఇంకో తప్పు చేయటానికి రెడీ అవుతున్నాడు.

సౌందర్య కార్తీక్ దగ్గరకు వచ్చి భారతీ నాతో వీడియోకాల్ లో మాట్లాడింది అంటుంది. అవన్నీ నమ్మకు మమ్మీ అంటాడు కార్తీక్. సౌందర్య చచ్చిపోతుందేమోరా అంటుంది. నాకేంటి మమ్మీ, నేనే తప్పు చేయలేదు అంటాడు. సౌందర్య ఒక డాక్టర్ గా ఆలోచించరా అంటుంది. దూరం నుంచి దీప చూసి వస్తూ ఉంటుంది. సౌందర్య దీప వస్తుందిరా..చిన్నగా మాట్లాడరా అంటుంది. చూశావా మమ్మీ మనం భయపడుతున్నామ్ అంటే తప్పుచేస్తున్నామ్ అనే కదా..ఇప్పుడు నేనెళ్లి సంతకం పెడితే..దీపను దారుణంగా మోసం చేసినవాడ్ని అవుతాను..నావల్ల పదకొండేళ్లు దీప దూరంగా ఉంది అంటాడు. దీప వస్తుంది. ఏంటి దీప రిపోర్ట్స్ తెస్తా అన్నావ్ అని సౌందర్య అంటుంది. ఇంట్లో చిన్నపని ఉంది చూసుకుని వెళ్తాను అంటుంది దీప. సరే చేసుకో అని సౌందర్య అంటుంది. దీప ఏంటి డాక్టర్ బాబు ఏదో అంటున్నారు అంటే..కార్తీక్ ఏం లేదు అంటాడు. దీప వెళ్లిపోతుంది.

చూశావా మమ్మీ ఈ ఒక్క ప్రశ్నకే మన దగ్గర సమాధానం లేదు..రేపు సంతకం చేస్తే దీపకు ఏం సమాధానం చెప్తావ్ అంటాడు కార్తీక్. తనకు ఎలా తెలుస్తుందిరా అంటుంది సౌందర్య. సౌందర్య ఇంత తెలివితక్కువగా ఎలా ఆలోచిస్తుందే అసలు..సంతకం పెట్టించుకునేది రేపు రచ్చచేయటానికి కానీ సౌందర్య ఫుల్ గా భారతి మాటలను నమ్ముతుంది. కార్తీక్ ను బలవంతం చేస్తుంది. దానీమీద కోపంతో పసిబిడ్డకు అన్యాయం చేయొద్దురా అంటుంది. సౌందర్య సెంటీడైలాగ్స్ కి కార్తీక్ కూడా కరిగిపోతాడు.

దీప వంటగదిలో వంటచేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. పాపం దీపను చూస్తే ఈ సీన్ లో జాలివేస్తుంది నిజంగా. సౌందర్య మెట్లుదిగతూ కార్తీక్ త్వరగారారా అంటుంది. దీప చూసి అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అంటే…గుడికి వెళ్తున్నాం అంటుంది సౌందర్య. వెళ్తున్నామా అంటే..కార్తీక్ నేను వెళ్తున్నాం అంటుంది. ఇంత హఠాత్తుగా గుడికి ఎందుకో అనుకుని నేను వస్తాను అంటుంది దీప. వాడితో చిన్న మొక్కు ఉండిపోయింది..ఈసారికి మేము ఇద్దరం వెళ్తాం అంటుంది సౌందర్య. దీప పాపం అమాయకంగా డాక్టర్ బాబు ఏం మొక్కు అంటే..మొక్కుకుంది నేనే వాడికేం తెలుసు..రమ్మంటే వస్తున్నాడు అంటుంది. దీపకు అర్థమవుతుంది.

ఇద్దరూ వెళ్తారు..దీప అత్తయ్య చెబుతున్నది అబద్ధం అని తెలుస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుని జరిగిన సీన్స్ అన్నీ రివైజ్ చేసుకుంటుంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా విచిత్రంగా చెప్తున్నారేంటి అనుకుంటుంది అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో దీప హాస్పటల్ కి వచ్చి అక్కడ ఉన్న స్టాఫ్ మీద అరుస్తుంది. అసలు నువ్వు మనిషేవేనా..డాక్టర్ బాబు శాంపిల్ కి ఇచ్చింది…ఆ మోనితకు ఎలా ఇస్తావ్ అంటుంది. ఆమె మేము అలా చేయలేదు మేడమ్..కోటిరూపాయలు ఇచ్చినా మేము ఆ పని చేయం అంటుంది. ఇంకోవైపు మోనిత నేను చచ్చిపోయేలోగా మీకు ఒక నిజం చెప్పాలి అని కార్తీక్, సౌందర్యలకు ఈ బిడ్డ ఆర్టీఫీషియల్ ఇన్సెమ్యూనేషన్ తో పుడుతున్న బిడ్డకాదు..సహజంగా మనకు పుట్టిన బిడ్డ అంటుంది. అంతే కార్తీక్ కు దిమ్మతిరిగిపోతుంది. దీపకూడా మోనిత దగ్గరకు వస్తూ ఉంటుంది. రేపు చూడాలి..హాస్పటల్ లో ఎంత రచ్చ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version