కార్తీకదీపం ఎపిసోడ్ 1193: వంటలక్కా మజాకా..మోనిత ఇంటికి వెళ్లి అసలు సినిమా ఇప్పుడు ఉంటుందని సవాల్ చేసిన దీప..!

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పూజలో కుర్చున్న మోనిత కావాలనే కార్తీక్ దగ్గరదగ్గరగా జరుగుతుంది. పంతులుగారు పూజ స్టాట్ చేస్తారు. దీపకూడా అదే గుడికి వస్తుంది. గుడిబయట సౌందర్య కారు చూసి మన కారు ఇక్కడ ఉంది, నువ్వు వెళ్లు అంటుంది. వారణాసి పర్లేదు అక్కా నేను వెయిట్ చేస్తాను అంటాడు. నా మీద ప్రేమ, గౌరవం ఉంటే చెప్పింది చేయ్ అంటుంది. సరే జాగ్రత్త అక్కా అంటాడు. నాకు ఎందుకురా జాగ్రత్తలు చెప్తున్నావ్ అంటే..నిన్ను చూస్తేనే భయమేస్తుంది అక్కా, ఏం మాట్లాడదాం అన్నా అరుస్తున్నావ్ అంటాడు. చచ్చిపోతానేమో భయమేస్తుందా..అది నీను నా మీద ఉన్న ప్రేమ అంతే..నాకేం కాదురా అని నాలుగు మంచిమాటలు చెప్పి.నేను ఆ కారులో వస్తాను అని గుడిలోపలికి వెళ్తుంది. గుళ్లో పూజ జరుగుతూ ఉంటుంది. మోనిత నువ్వుతూ ఉంటే..కార్తీక్ మొఖం మాడ్చుకుని కుర్చుంటాడు.

దీప కారు గుడిబయట ఉంది, గుడిలో ఎవరున్నారు అనుకుని మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఎవరూ కనిపించరు, ఎవరూ రాలేదా అనుకుని గుడి అంతా తిరుగుతుంది. మొత్తానికి దీప మోనిత కార్తీక్ కలిసి పూజచేయటం చూస్తుంది. ఆ సీన్ చూడగానే దీపకు కల్లుతిరిగినట్లు అవుతుంది. డాక్టర్ బాబు మోనిత పక్కపక్కనే కుర్చోని పూజచేస్తున్నారా అనుకుని, అత్తయ్యగారు మీరు దగ్గరుండి ఇద్దరితో పూజ చేయిస్తున్నారా అని ఏడుస్తుంది. అత్తయ్య మీరు కూడా మారిపోయారా, ఇంత ద్రోహమా అని బాధపడుతుంది. వాళ్లు ప్రదక్షిణాలు చేయటం చూసి దీప కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. నూనెలో పిల్లవాడి ప్రతిబింబాన్ని చూడండి అని చూపిస్తారు. బాబుతో సహా కుర్చుోని పూజచేయటం చూసి డాక్టర్ బాబు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ పూజలేంటి, పదకొండేళ్లు మిమ్మల్ని నమ్మానుకదా అని తలుచుకుని ఏడుస్తూనే ఉంటుంది. మోనిత కార్తీక్ తో బాబుని చూడు అచ్చం నీ పోలీకే అంటుంది. ఇన్నాళ్లు నన్ను వీళ్లుతప్పించుకుంది ఇందుకా, నేను రాగానే మాటమారుస్తుంది ఇందుకా, హాస్పటల్ కివెళ్లి డాక్టర్ బాబు సంతకం పెట్టారు అంటే మానవత్వం అనుకున్నాను అని వెళ్లిపోతుంది. వెనక నుంచి దీపను కార్తీక్ చూస్తాడు. దీప వచ్చిందా లేక వచ్చినట్లు నాకు అనపిస్తుందా అనుకుంటాడు.

నూనెను నైరుతి వైపు పోసిరా అని పంతులు తన శిక్ష్యుడ్ని పంపిస్తాడు. దీప సాడ్ సాంగ్ వేసుకుని బయటకు వస్తూ ఉంటుంది. దీప బాధ పగొడికి కూడా రాకూడదురా బాబు..పాపం ఎలా ఏడుస్తుందో.. ఆ పంతులితో అక్కడ ఏదో పూజ చేస్తున్నారు కదా ఏంటది అని దీప అడుగుతుంది. తండ్రికి ప్రాణ గండమని దోషనివారణ పూజను ఆ దంపతులు చేస్తున్నారమ్మా అని ఇంతకీ మీరెవరమ్మా అంటాడు. అదే తెలియటం లేదు పంతులుగారు అంటుంది. వెళ్లిపోతున్నారు, దర్శనం చేసుకున్నారమ్మా అంంటే…బ్రహ్మాండంగా అయింది అని ఏడ్చుకుంటూ దీప వెళ్లిపోతుంది.

గుళ్లో పూజ అయిపోయింది అని పంతులు గారు చెప్పడంతో మోనిత మా అబ్బాయిని ఆశీర్వదించండి అంటుంది. పేరేం పెట్టారని అడగరేం పంతులుగారు అని మోనితే చెప్తుంది. ఇంకా బారసాల నామకరణం జరిపించలేదు అనుకోండి..మావగారి పేరే పెట్టాం ఆనంద్ రావుగారు అని అంటుంది. పెద్దల్ని గౌరవించటం చాలా మంచి విషయం అని పంతులుగారు అంటే..నాకు పెద్దలంటే మహా గౌరవం అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది. పంతులుగారు పూజ అయ్యింది కదా మేమం వెళ్లొచ్చు కదా అంటే..కాసేపు ఉండి వెళ్లమనని చెప్పి పంతులు వెళ్లిపోతాడు.

మోనిత ఇక అబ్బాయిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, ఒకసారి ఎత్తుకోండి అని బలవంతం చేస్తుంది. కార్తీక్ నీ పేరు పలకటానికే నాకు చిరాగ్గా ఉంది అంటే..అలాంటప్పుడు ఏ, ఏమో, ఒసేయ్ అని పిలవొచ్చుకదా.. అంటుంది. నువ్వేం అనుకుంటున్నావ్ అని కార్తీక్ అంటే..చాలా అనుకున్నాను, అనుకున్నవి అన్నీ అయ్యాయ్, ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయ్ అంటుంది. కార్తీక్ ఆరోజు కూడా మమ్మీ బలవంతం చేసింది కాబట్టే వచ్చాను, పూజ అయిపోయింది ఇక నువ్వు వెళ్లు అంటే..ఇప్పుడు నేను ఇంటికి వస్తాను అనలేదే..త్వరలోనే వస్తాను కోడలిగా అంటుంది మోనిత. మమ్మీ ఏంటి గోలా అందుకే నేను రానన్నాను అని కార్తీక్ అంటే..కార్తీక్ టైం బాలేకపోతే వసుధేవుడంతటి వాడే గాడిదకాళ్లు పట్టుకున్నాడంటారు అంటుంది సౌందర్య అవసరం తీరాక మంచి సామెతే చెప్పారే అనండి అత్తయ్య, అనే హక్కు మీకు ఉంది, మీ వంశానికో వారసుడ్ని ఇచ్చాను ఆ కృతజ్ఞత కూడా లేదా మీకు..ఆనంద్ రావు గారు అని వాళ్ల నానమ్మకు ఇవ్వు అని బలవంం చేస్తుంది.

కార్తీక్ వెళ్దాం పదా మమ్మీ అంటాడు. ఉండొచ్చుగా కాసేపు అని కార్తీక్ చేయి పట్టుకుంటుంది. ఉండొచ్చుగా కాసేపు బాబుతో కబుర్లు చెప్పుకుందాం అంటుంది. నీ బతుకు నువ్వు బతుకు గుడ్ బాయ్ అని కార్తీక్ ముందుకువెళ్లితే..మోనిత ఆపేస్తుంది. ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో ఉంది అసలైన ట్విస్ట్. మోనిత ప్రియమణితో మాట్లాడుతుంటే దీప వస్తుంది. మోనితా కార్తీక్ ల ప్రేమయాణం ముగిసింది దీపక్కా, నీ సినిమా ఫ్లాప్ అంటుంది మోనిత. దీప దర్జాగా సోఫాలో కుర్చుని..అసలు సినిమా ఇప్పుడే మొదలైంది మోనిత..ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అని తలబాదుకునేలా చేస్తా నీ మీద ఒట్టు అంటుంది దీప. వంటలక్క డైలాగ్స్ కి మోనితకు దెబ్బకు దిమ్మతిరిగి పోతుంది. చూడాలి కాస్త కథ ఇప్పటికైనా ప్రేక్షకులకు నచ్చే యాంగిల్ మార్చారా లేదా అని.

Read more RELATED
Recommended to you

Exit mobile version