అవసరమైతే.. గుండు కొట్టించుకుంటా : అనసూయ హాట కామెంట్స్‌

-

నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ.. ఓ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ. రంగ స్థలంలో రంగమత్తగా నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాంకర్‌ అనసూయ.. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ పుష్ప సినిమా దాక్షాయని అనే కీలక పాత్రలో నటిస్తోంది.

Anasuya Bharadhwaj

తాజాగా ఈ సినిమాలో అనసూయ ఫస్ట్‌ లుక్‌ ను కూడా చిత్ర బృందం రివీల్‌ చేసింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఇన్‌ స్టా గ్రామ్‌ లో అభిమానులతో సరదాగా మచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం మిచ్చారు అనుసూయ. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని.. ” మీకు పెద్ద సినిమాలో మంచి పాత్రలో నటించే అవకాశం వస్తే.. దాని కోసం గుండు చేయించుకుంటారా ?” అని అడిగాడు. అయితే.. దీనిపై చాలా సింపుల్‌ అన్సర్‌ ఇచ్చింది అనసూయ. అలాంటి పాత్ర వస్తే.. కచ్చితంగా గుండు చేయించుకుంటానని ఆమె పేర్కొంది. పుష్పలో తన రోల్‌ చాలా బాగుంటుందని ఆమె చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version