కార్తీకదీపం ఎపిసోడ్ 1227: తండ్రి ఒడిలోకి చేరిన బుల్లి ఆనంద్ రావు..పిల్లలు కనిపించటం లేదంటూ కార్తీక్ టెన్షన్

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో రుద్రాణి ఇచ్చిన అగ్రిమెంట్స్ మీద కార్తీక్ సైన్ చేస్తాడు. సంతకం పెట్టాడు సరే..మరి డబ్బులు ఇ‌వ్వకపోతే అని ఒకడు అంటే..రుద్రాణి అతని చెంపపగలుకొట్టి..గడువు లోగా డబ్బులు ఇవ్వకపోతే..ఇద్దరు అమ్మాయిలు ఉన్నారుగా..అందులోంచి నేను ఒకర్ని తెచ్చుకుంటానని రాశాంకదా అంటుంది. కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇంట్లో పిల్లలు నాన్న ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తారు. దీప వాళ్లను పడుకోపెడుతుంది. కార్తీక్ వస్తాడు. ఈ టైంలో మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అని దీప అంటే..కార్తీక్ ఎప్పటిలాగే చెప్పడు. మనోడికి ఆస్తులు పోయినా..ఇంకా బుద్దిరాలేదు..అన్నీ పెళ్లాంతో చెప్పొచ్చుగా..సొంతపెత్తనాలు చేస్తాడు. మనం డబ్బు ఇస్తాం అన్నాం కదా..కొన్ని పేపర్స్ మీద సైన్ చేయించారు అంటాడు. అంత డబ్బు మనం ఇవ్వగలమా అంటే..డబ్బు గురించి నువ్వేం టెన్షన్ పడకు అంటాడు కార్తీక్.

ఇక్కడ మోనిత సౌందర్య ఇచ్చిన షాక్ తలుచుకుని..విర్రవీగిపోతూ ఉంటుంది. నిద్రపోతున్న ప్రియమణిని లేపి నేనింత టెన్షన్ పడుతున్నాను..నీకు ఎలా నిద్రపడుతుంది. నా బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారు, కార్తీక్ ఎటో పోయాడు అంటుంది. ఆన్టీ వచ్చి వార్నింగ్ ఇచ్చింది. వాళ్లు ఏమనుకుంటున్నారు..అలా ఎలా వదిలేస్తాం, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కదా అంటుంది. ప్రియమణి మీరు చెప్పింది నిజమే కదా..రాత్రంతా కుర్చోని ఆలోచించండి..పొద్దున లేచాకా నాకు చెప్పండి అని ప్రియమణి మళ్లీ పడుకుంటుంది.

మరోపక్క కార్తీక్ రుద్రాణి మాటలను తలుచుకుని..పిల్లలను చూసుకుంటాడు. దీప చూస్తుంది. కార్తీక్ బాబు ఏమైంది అంటే..నిద్రపట్టటంలేదు దీప అంటాడు కార్తీక్. నువ్వు పడుకోమంటాడు. దీపకు అనుమానం మొదలవుతుంది. తెల్లారుతుంది.

ఆదిత్య వాళ్లు కాఫీ తాగుతూ..మమ్మీ ఏదోఒకటి ఆలోచించు మమ్మీ ఏంటి గోలమనకు అంటాడు. అవును సౌందర్య మనమెందుకు ఇంత ఓపిక పట్టాలి, ఓ వైపు కార్తీక్ ఎక్కడ ఉన్నాడని తెలియక మన బాధలో ఉంటో అంటాడు. ఇంతలో మోనిత ప్రియమణీ అని కేకలు వేస్తూ వస్తుంది. అందరికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇంతలో ప్రియమణి వస్తుంది. మోనిత తన కొడుకు ఫొటో ఫోనులో చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకమ్మా అని ప్రియమణి అంటే..మోనిత భారీ డైలాగ్స్ చెప్పి..ఫైనల్ గా..నా బాబు ఫొటోను పేపర్ లో వేయిస్తున్నాను..వెళ్లి యాడ్ ఏజెన్సీకి ఇవ్వు అంటుంది. నా బాబు ఆచూకి తెలిపిన వారికి ఫామ్ హౌస్ రాసిస్తాను అంటుంది మోనిత. ఇంత చిన్న ఫొటోను ఎవరు గుర్తుపడతారు అంటే బాబు వీపు మీద రూపాయి బిళ్ల అంత పుట్టుమచ్చ ఉంటుంది అంటుంది. ఫోన్ నంబర్ ఎవరిది ఇవ్వాలి అంటే..మోనిత మావయ్యగారిది ఇవ్వే అంటుంది. అంతే అప్పటివరకు చూస్తున్న సౌందర్య వాళ్లు లేచి ఊరుకుంటుంటే పేట్రేగి పోతున్నావ్ ఏంటే అని తాలోఓమాట అంటారు. ఆఖరికి ఆనంద్ రావు కూడా బెదిరిస్తాడు.

ఇక్కడ బుల్లి ఆనంద్ రావును శ్రీవల్లి రెడీ చెస్తూ ఉంటుంది. పుట్టుమచ్చను పిల్లలు చూసి భలే ఉందికదా అనుకుంటారు. వీడికి ఓ మంచి పేరు సెలక్ట్ చేద్దాం అని పిల్లాడ్ని శౌర్య ఎత్తుకుంటుంది. ఆడుకోవడానికి బయటకు తెస్తారు. దీప దగరకు తెస్తారు. దీప ఎత్తుకుని ఆడుతుంది. కార్తీక్ కూడా ఎత్తుకుంటాడు. మొత్తానికి తండ్రిదగ్గరకు చేరాడనమాట.

మరోవైపు మోనిత ఏడుస్తూ..నాకు కన్నీళ్లు వస్తాయా అనుకుని..తనలో తనే ఏదో ఒకటి మాట్లాడుకుంటుంది. గతాన్ని తలుచుకుంటుంది. కార్తీక్ నన్ను భార్యగా గుర్తించలేదు..నన్ను ఒక తల్లిగా కూడా గుర్తించలేదు..అసలు వీళ్లు మనుషులేనా..వీళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. నేను గెలవాలి గెలుస్తాను అనుకుంటూ శపథాలు చేసుకుంటుంది. ఇక్కడ కార్తీక్ పిల్లలను పిలుస్తాడు. వాళ్లు ఉండరు. దీపకు చెప్తాడు. దీపకూడావెతుకుతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version