కార్తీకదీపం ఎపిసోడ్ 1230: శ్రావ్యబిడ్డను మాయం చేసిన మోనిత..ఏం చేయలకపోతున్నానని కార్తీక్ ఆ‌వేదన

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య-మోనిత మధ్య డిస్కషన్ తో మొదలైంది. మీరు దీప దగ్గర నుంచి హిమను ఎత్తుకెళ్లారు కదా..ఆ పని గొప్పా అని నిలదీస్తుంది. సౌందర్య పిచ్చివాగుడు తగ్గించి..వెళ్లి నీ కొడుకును వెతుక్కో..కాదు కూడదు అని ఇక్కడే ఉంటే..ఎప్పుడో ఒకసారి..వేడి వేడి అట్లకాడతో ఆటోగ్రాఫ్ ఇస్తాను ..తిక్కకుదురుతుంది అంటుంది సౌందర్య. దెబ్బకు అక్కడనుంచి వెళ్లిపోతుంది మోనిత. వారణాసిని ఏదైనా ఆచూకి తెలిస్తే చెప్పరా అంటుంది. వాడు ఏం తెలియదు మేడమ్ అని వెళ్లిపోతాడు.

దీప ఇంట్లో

హిమ, సౌర్య, కార్తీక్ మొక్కలు నాటుతూ ఉంటారు. మొక్కలు నాటటం అవసరమా అంటే..కార్తీక్ మొక్కలు గురించి మంచిగా చెప్తాడు. ఇంతలో దీప ఇంటికి వచ్చి మంచి పని చేస్తున్నారు.. నేను నాటతాను అంటుంది. అప్పుడే అక్కడున్న శ్రీవల్లి దీప ఒంటి మీద బంగారం లేదని గమనించి..అడుగుతుంది. దీప సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంటే.. కార్తీక్, పిల్లలు దీపవైపే చూస్తుంటారు. శ్రీవల్లి అర్థమయిందలే అక్కా అంటుంది. ఇంతలో బాబు ఏడుపు వినిపించడంతో శ్రీవల్లి, పిల్లలు వెళ్లిపోతారు. వెంటనే కార్తీక్ దీపతో.. బంగారం అమ్మేశావా అంటే తాకట్టు పెట్టాను అంటుంది దీప. నేను చేతకానివాడిలా అయిపోయాను.. నన్ను ఏ పని చెయ్యొద్దు అంటావ్.. నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేస్తుంటావ్, నేనొక పనికిమాలనివాడిననని, కుర్చోని తింటున్నాను అని అంటాడు. అలా అని ఎవరు అన్నారు కార్తీక్ బాబు అంటే..నా మనసాక్షి ఉంటుంది కదా అని పక్కకు వెళ్లి కుర్చుంటాడు. దీప వెళ్లి ఒక్కోసారి మంచి పనులు చేసినా చేతికి మట్టి అంటుంది కార్తీక్ బాబు.. మీ తప్పేం లేదు కదా అని నీళ్లతో కార్తీక్ చేతులు కడుగుతుంది. నేను చేసిన తప్పుల్ని నువ్వు సరిదిద్దుతున్నావ్ దీపా అంటాడు కార్తీక్.

సౌందర్య ఇంట్లో మోనిత

మోనిత మనసులో బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. నేనేంటి నా బిడ్డ కనిపించటం లేదంటే..ఏడవటం లేదు..నేను తల్లిని కాదా.. ‘నేను తల్లిగా ఓడిపోతున్నానా? నా కన్న ప్రేమ వీళ్లకి అర్థం కావట్లేదా? తెలిసేలా చేస్తాను అనుకుంటుంది. ఆనందరావుగారు మిమ్మల్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటా అంటుంది.

రుద్రాణి ఇంట్లో

మరోవైపు దీప తాకట్టు పెట్టిన బంగారం తీసుకెళ్లి రుద్రాణికి ఇస్తాడు సేటు. ఆ దీప డబ్బు తెచ్చి నా బంగారం నాకు ఇవ్వమంటే రుద్రాణికి అమ్మేశానని చెప్పు అని సేటుని పంపించేస్తుంది. అసలు ఈవిడకు జనాలు ఎందుకు భయపడుతున్నారు..నలుగుర్ని వేసుకుని ఓ ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీప బంగారాన్ని చూస్తూ రుద్రాణి….దీపా భూమి గుండ్రంగా ఉంది దీపా.. ఎప్పటికైనా వీటి కోసం నువ్వు వీటికోసం నా దగ్గరకు రావాల్సిందే అనుకుంటుంది.

దీప దగ్గర

మరోవైపు దీపవాళ్లు పడుకుని ఉంటారు. దీప మనసులో.. రుద్రాణి మమ్మల్ని మనశ్సాంతిగా బతకనిచ్చేట్టు లేదని దీప బాధపడుతుంది. కార్తీక్ మాటలు తలుచుకుని కుమిలిపోతుంది. పిల్లలు కథ చెప్పమన్నా పడుకోమ్మా అనేస్తాడు కార్తీక్. ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది. అమ్మా నీకో విషయం తెలుసా అని శౌర్య..తమ్ముడు…నాన్న ఎత్తుకుంటే ఏడుపు ఆపేస్తాడని చెబుతుంది. అవునమ్మా మంచి వాళ్లంటే పిల్లలకి నచ్చుతారమి కోటేష్ బాబ్భై చెప్పాడు అంటుంది. అవును అంటుంది దీప. మంచి వాళ్లంటే ఏంటి అని శౌర్య అంటే..ఒకరు అవసరంలో ఉంటే..మన దగ్గరఉన్నదంతా ఇచ్చేయటం అంటుంది దీప. కార్తీక్ ఆస్తంతా వేరేవాళ్లకి ఇచ్చేసిన విషయం గుర్తుచేసుకుంటారు.

సౌందర్య ఇంట్లో:

శ్రావ్య ఏడుస్తూ .. అత్తయ్యా దీపుగాడు కనిపించడంలేదంటుంది. సౌందర్య కంగారు పడకు అంతా చూశావా అంటుంది..ఇద్దరూ ఇళ్ళంతా వెతుకుతారు. ఇంతలో మోనిత రాగానే.. శ్రావ్యకు అర్థమైపోతుంది. మోనితా దీపుని మాయం చేసిందని. మోనిత మాత్రం ఏం పట్టనట్లుగా కూల్‌గా ఉంటే..సౌందర్య గొంతుపట్టుకుని వార్నింగ్ ఇస్తుంది. మోనిత మాత్రం ఏం తెలియనట్లు..ఏంటి కొత్త నాటకమా..నా కొడుకు కనిపించక నేను ఏడుస్తుంటే..మధ్యలో ఈ దీపుగాడి గోల ఏంటి..సరే అయితే వెతుకుదాం పదండి అని మోనిత అంటే.. వెంటనే కాళ్ల మీద పడిపోతుంది శ్రావ్య. ‘మోనితా నీకు దండం పెడతాను ప్లీజ్ నా బాబుని నాకు ఇచ్చెయ్ అని ఏడుస్తుంది. శ్రావ్య ఏడుస్తుంటే.. మోనితకే బాధనిపిస్తుంది. సౌందర్య మాత్రం.. శ్రావ్యలే దాని కాళ్లు పట్టుకుంటావేంటని తిడుతుంది. లేదత్తయ్యా.. మోనితే నా బాబుని తీసుంటుందని ఏడుస్తుంది. మోనిత పొగరుగా సౌందర్య వైపు చూస్తూ.. పైకి మెట్లు ఎక్కుతూ మధ్యలో ఆగి అక్కడే కాలు మీద కాలేసుకుని ఇప్పుడు అర్థమైందా శ్రావ్యా కన్నప్రేమ.. బాబు కనిపించకపోతే ఎలా ఉంటుందో చిన్న శాంపిల్ చూపించానంతే అంటుంది. ‘వెళ్లు.. నా బెడ్ కింద దాచిపెట్టాను వెళ్లి తెచ్చుకో’ అని చెబుతుంది. శ్రావ్య ఏడుస్తూ పరుగుతీస్తుంది. సౌందర్య కోపంగా మోనిత వైపుచూస్తుంది. సారీ ఆంటీ అంటుంది మోనిత. ఎపిసోడ్ అయిపోతుంది.

రేపటి ఎపిసోడ్

స్కూల్ కి వెళ్తున్న పిల్లలకు కార్తీక్ జేబులోంచి పది రూపాయలు తీసి ఏదైనా కొనుక్కోమని ఇస్తాడు. వద్దు డాడీ అంటారు పిల్లలు. మీరు కూడా నాపై జాలి పడొద్దు ప్లీజ్ అంటాడు. మరోవైపు దీప తలపై బియ్యం బస్తా,సరుకులు మోసుకుంటా రావడం చూసి కార్తీక్ బాధపడతాడు. అప్పులు ఎలాతీర్చాలనే ఆలోచనలో రోడ్డుపై నడుస్తూ వెళుతుంటాడు కార్తీక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version