కార్తీకదీపం ఎపిసోడ్ 1204: సీరయల్ లో హై టెన్షన్..బాధతో బయలుదేరిన కార్తీక్ ఫ్యామిలి..బ్యాగ్ తో మోనిత ఇంటికి వెళ్లిన వంటలక్క

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో ఆరోజు రాత్రి దీప తండ్రికి కొత్తబట్టలు తెస్తుంది. పండగపూట ఇంటికి వచ్చావు, అల్లుడిగారితో వస్తే ఇంకా బాగుండేది అంటాడు మురళీకృష్ణ. మీ పెద్దవాళ్లతో ఇదే తలనొప్పి.పెళ్లైతే కూతురు పుట్టింటికి ఒక్కతే రాకూడదా నాన్న అంటాడు. నువ్వు బానే ఉన్నావు కదా అని మురళీకృష్ణ అడిగితే..బాగుండటం అంటే ఏంటో నాకు ఇప్పటివరకూ అర్థంకాలేదు అని దీప మళ్లీ సెంటిమెంట్ డైలాగులు చెప్తుంది. మురళీకృష్ణకు మనసులో టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఆ మోనిత ఏమైనా అంటే..ఆ మోనిత గురించి ఎందుకు నాన్న..అది అంతా మామూలే కదా..అని ఇంకేంటి కబుర్లు , పిన్ని ఎప్పుడు వస్తుంది అంటే..పుట్టింటికి వెళ్లింది, పుట్టింటి తరుపున వచ్చే ఆస్తులు ఏవో రావాలంట అందుకే వెళ్లింది అంటాడు మరుళీకృష్ణ. అలా వాళ్లు మాట్లాడుకుని..తిందాం రండి నాన్న అంటుంది దీప. మురళీకృష్ణ మనసులో దీపకు ఏమైంది, పండగపూట ఒక్కతే వచ్చింది, అడిగితే చెప్పటం లేదు అనుకుంటాడు.

మరోపక్క మోనిత ఇంట్లో బారసాలకు ఇళ్లు డెకరేట్ చేయిస్తుంది. ఓ హడావిడి చేస్తుంది. ఇంతలో భారతి వస్తుంది. ఏంటి మోనిత ఏం జరుగుతుంది..బారసాలకు కార్తీక్ స్టాఫ్ ని నీ స్టాఫ్ ని రమ్మన్నావంట అంటుంది. ఫంక్షన్ కి తెలిసినవాళ్లని పిలుస్తాం కదా అంటుంది మోనిత. అన్నీ సంపద్రాయం ప్రకారం జరిగాయా ఏంటి అంటే..మోనిత తనదైన శైలిలో నాలుగు డైలాగ్స్ చెప్తుంది. నువ్వే చెప్తే వినవు.నువ్వు మారవు నాకు తెలుసు అని వెళ్లిపోతుంది. మోనిత నేనెందుకు మారాలి, నా చుట్టూ ఉన్న వాళ్లను మారుస్తాను, దీపక్కే మారింది అని ప్రియమణితో కాసేపు ఆడుకుంటుంది. ఏంటో నమ్మా మీ ధైర్యం నాకు అస్సలు అర్థంకావటంలేదు అని ప్రియమణి అంటే..మెడలో తాళి చూపించి ఇదే నా ధైర్యం. ధైర్యే సాహసే మోనిత అంటుంది.

మరుసటిరోజు ఉదయం కార్తీక్ వాళ్లు ముగ్గురు కారులో మోనిత ఇంటికి బయలుదేరుతారు. కార్తీక్ దీప గురించి ఆలోచిస్తాడు. ఆనంద్ రావు ఏంటిది సౌందర్య, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం నాకేం అర్థంకావటంలేదు అంటాడు. సౌందర్య ఇంకా అర్థంకాకపోవటానికి ఏం ఉంది, మోనిత ముందు దీప మనసు విప్పింది, అంతా అయిపోయింద అని బాధపడుతుంది. కార్తీక్ మనం మోనిత ఇంటికి వెళ్లడమేంటి, వెనక్కు వెళ్దాం మమ్మీ, అక్కడ ఆ మోనతి ఇంకెన్నీ ప్లన్స్ వేస్తుందో అంటాడు. సౌందర్య నువ్వు మోనిత గురించి ఆలోచిస్తున్నావు, నేను దీప గురించి ఆలోచిస్తున్నాను..పదకొంకడెళ్లు మనకు దూరంగా ఉంది, ఇప్పుడు ఈ నిజం తెలిసి ఏం చేస్తుందో. నా పెద్దకోడల్ని ఇకముందు చూడగలనో లేనో అని భయమేస్తుంది అండి అని ఏడుస్తుంది. వీళ్లు ఇలానే తలాఓమాట అని సీన్ ల్యాగ్ చేస్తారు.

మోనిత ఇంటికి అతిథులు అంతా వస్తారు. మోనిత అందరికి వెల్కమ్ చెప్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా, దీపక్కా వస్తా అని వాళ్లను తీసుకువస్తాను అని చెప్పింది..అందులో నిజమెంత అనుకుంటుంది. ఇంతలో భారతి వస్తుంది. ఏంటి భారతి ఇంత లేటుగా వచ్చావు అంటుంది. భారతి ప్రియమణిని పిలిచి మోనితకు ఏంటి ఇంత ధైర్యం, వాళ్లు వస్తారని ఎలా అనుకుంటుంది అంటుంది. ఏమోనమ్మా నేను చెప్తే వినదు, మీరైనా చెప్పొచ్చుకమ్మా అంటుంది ప్రియమణి. మోనిత వచ్చి ప్రియమణిని బాబుని చూసుకోమని పంపించి మోనిత భారతీతో కాసేపు మాట్లాడుతుంది. మళ్లీ డోర్ వైపు చూసి మా అత్తగారు ఇంకా రావటంలేదేంటి, దీపక్కా వస్తా అనింది ఇంకారేలదు అసలు వస్తుందా అనుకుంటుంది. ఇంతలో ఆటోలో దీప ఓ బ్యాగ్ వేసుకుని దిగుతుంది. నువ్వెళ్లు వారణాసి అని దీప అంటే..మనోడు నేను వెళ్లను అక్కా ఇక్కడే ఉంటాను అంటాడు. కానీ దీప వారణాసికి ధైర్యం చెప్పి లోపలికి వస్తుంది.

ఇంతలో ప్రియమణి వచ్చి ఆ క్యాటరింగ్ వాళ్లు మనకు హ్యాండ్ ఇచ్చారు, అడిగనవి అన్నీ పంపించలేదు అంటుంది. అసలే మా అత్తయ్యవాళ్లు ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గోల ఏంటి..వచ్చినవాటితో సరిపెట్టుకుందాం అంటుంది. ఇంతలో దీప ఎంట్రీ ఇస్తుంది. మోనిత మనసులో దీపక్కా బ్యాగ్ తో వచ్చిందేంటి, ఇటునుంచి ఇటే బస్తీకి వెళ్లటానికి రెడీ అయిపోయిందా అనుకునుి దీపకు వెల్కమ్ చెప్తుంది. దీప వచ్చి పర్లేదు మోనిత గొప్పగా చేస్తున్నావు అని పక్కనే ఉన్న భారతీని, ప్రియమణిని పలకరిస్తుంది. ప్రియమణితో ఆ బ్యాగ్ లోపలిపెట్టు అడిగినప్పుడు తీసుకురా అంటుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో మోనిత కార్తీక్ వల్లే నేను తల్లిని అయ్యాను అంటుంది. నోరు మూయ్ అని కొట్టేదానికి చేయి పైకి లేపతుంది దీప. ఆ బ్యాగ్ లోంచి పేపర్స్ బయటకు తీసి..ఏదేదో చెప్తుంది. మోనిత బిత్తరపోయి చూస్తుంది. మొత్తానికి సంథింగ్ ఈస్ ఫిషీ. రేపు మాత్రం సీరయల్ లో ఏదో ట్విస్ట్ జరగబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version