కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత వెళ్తూ దీపవాళ్లతో చాలా మాటలు అంటుంది. కార్తీక్ కి లవయూ చెప్పి బండి ఎక్కుతుంది. ఆరోజు రాత్రి కార్తీక్ తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు. దీపకు చేసిన అన్యాయం, శౌర్య మొదటిసారి నాన్న అని చెప్పిన సీన్, మోనిత ఎలా గర్భందాల్చిందో చెప్పిన సీన్ ఇలా అన్నీ తలచుకుంటూ ఉంటాడు. దీప కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. సౌందర్యను అడుగుతుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆనంద్ రావు వచ్చి బయటకెక్కడికి వెళ్లిఉండడు సమాజాన్ని ఎదుర్కోలేక మొఖం చాటేస్తున్నాడు అనుకుని అందరు కలిసి మేడమీదకు వెళ్తారు. కార్తీక్ దీనంగా ఉండటం చూసి ఏమైంది అన అడుగుతారు.
దీప ఆ మాటలకు దీనంగా ముందుకెళ్లి నుల్చుటుంది. సౌందర్య కార్తీక్ కు ధైర్యం చెప్తుంది. తప్పుచేసిన వాళ్లే భయపడాలి, నిజాయితిపరులు గుండెనిబ్భరంగా ఉండాలి, ఏదైనా జరిగినప్పుడు దానిగురించి ఆలోచిద్దాం కానీ అంతదాక నీ అపురూపమైన భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపు అని దీప దగ్గరకు వెళ్లి..వాడు ఆలోచనలు తిని, నువ్వు కన్నీళ్లుతాగి కడుపునింపుకోకుండా వాడ్ని భోజనానికి తీసుకురా అని సౌందర్య, ఆనంద్ రావు వెళ్తారు.
ఇంకోవైపు శ్రావ్య, ఆదిత్య మోనితకు వేసిన శిక్ష గురించి మాట్లాడుకుంటారు. అంత తక్కువ వేశారేంటి ఆదిత్య ..అది చేసిన నేరాలకు ఒక్కోదానికి ఏడాది వేసిన జీవత కాలం సరిపోతుంది అని శ్రావ్య అంటుంది. అవును అని మోనిత… కార్తీక్, దీప, పిల్లలకు చేసిన అన్యాయం గురించి మాట్లాడుకుంటారు. 18 నెలలు ఎంతసేపు ఆదిత్య ఇట్టే గడిచిపోతుంది.. అది విడుదలై వచ్చాక అక్కకిబావగారికి ఎంత నరకం చూపిస్తుందో అని శ్రావ్య భయపడుతుంది. ఆదిత్య మోనితకు అక్కడ జ్ఞానోదయమయై మంచిమనిషిగా బయటకొస్తుందేమో లేక రాక్షసత్వం ఎక్కువై వస్తే ఆ రాక్షసి కొమ్ములు, కోరలు ఎలా పీకేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని వెళ్తాడు.
కార్తీక్ హాలో కుర్చుని ఇంటిని కొత్తగా చూస్తాడు. శ్రావ్య వచ్చి ఏమన్నా తీసుకురావాలా అని అడుగుతుంది. ఏం వద్దు అని ఆదిత్యను ఓసారి రమ్మంటాడు. సరే అని శ్రావ్య వెళ్తూ..చాలా రోజులకి మిమ్మల్ని ఇలా ప్రశాంతగా చూస్తున్నాని చెప్తుంది. ఇంతలో పిల్లలు ఇద్దరు వస్తారు. దీప ఫ్రూట్స్ తెస్తుంది. శౌర్య, హిమ ఎక్కడికో వెళ్దాం అన్నావుగా అని కార్తీక్ ను కాకపాడతారు. దీప మాత్రం మీరే అంతా ప్లాన్ చేస్తున్నారు అంటే మా నాన్న మా ఇష్టం అని శౌర్య అంటుంది. శౌర్య వైజాగా ప్లాన్ చేస్తుంది. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా.. సౌందర్య, ఆనంద్ రావు వస్తారు. ఇప్పుడే ఇంట్లో ప్రశాంతత నెలకొంది..టూర్స్ , ప్లాన్ ఏం వద్దు అందరం ప్రశాంతంగా ఉందాం..ఎక్కడికి వెళ్లేది లేదు, అందరూ నా కళ్ల ముందు ఉండాల్సిందే అంటుంది సౌందర్య. మరి మేము నలుగురు అమెరికా వెళ్లాల్సి వస్తే అప్పుడేం చేస్తాం అని శౌర్య అంటుంది. సౌందర్య కోపంగా ఆ మాటకు వస్తే.. వాళ్లను పంపంచి మిమ్మల్ని ఇక్కడే ఉంచుకుంటాను, ఇండియాను దాటనిచ్చేది లేదు అంటుంది. హిమ శౌర్య వైజాగ్ వద్దని అమ్మానాన్నలను వదిలి మేము ఉండం అంటారు. నేను నవ్వుతూ అన్నానులే అని సౌందర్య అంటుంది. కార్తీక్ కూడా అవును నానమ్మ జోక్ గా చెప్పింది అంటాడు.
ఇంతలో ఆదిత్య జోక్ గా అన్నా కూడా అదే కరెక్ట్ అంటాడు. ఆ మాట అక్కడున్న ఎవరికి అర్థంకాదు. బాగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అంటాడు. కార్తీక్ కు మోనిత అన్న మాటలను గుర్తుచేసుకుని ఆదిత్య ఏంటి ఇలా అన్నాడు అనుకుంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో దీప కార్తీక్ కి పిల్లలకు ఈ వయసులోనే నిజం చెప్పేద్దాం అంటుంది. కార్తీక్ కోపంగా లేచి ఈ మురికి అంతా పిల్లలకు చెప్తే వాళ్లు ఏం అనుకుంటారు, ఏం అర్థం చేసుకుంటారు అని కోపంగా అరుస్తాడు. దీపకు ఆ ఆలోచన వచ్చిందంటే కచ్చింతంగా చెప్తుంది. చూద్దాం ఏం జరగుతుందో.