కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” కార్తికేయ 2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర సెంటర్లలోనూ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ జరిగింది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో మాత్రం కార్తికేయ 2 కి మంచి రెస్పాన్స్ వ స్తుంది. ఇది ఇలా ఉండగా… కార్తికేయ 2 ఓటిటి గురించి చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ.. కార్తికేయ2 డిజిటల్ రైట్స్‌ ను సొంతం చేసుకుందని టాక్. అంతేకాదు.. ఈ సినిమా ఈ నెల 30 వ తేదీన ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version