ఎలుకలు పిల్లలకు భయపడతాయని మనకు తెలుసు..కానీ అరటిపండ్లకు మగ ఎలుకలు భయపడతాయని మీరెప్పుడైనా విన్నారా..? కానీ ఇది నిజమే.. అరటిపండ్లకు మగ ఎలుకలు భయపడతాయట. అరటిపండ్ల నుంచి వచ్చే వాసన వాటికి అస్సలు నచ్చదట.. అందుకే ఎలుకలు పారిపోతాయని ఓ పరిశోధనలో తేలింది. అరటిపండ్ల వాసనను చూస్తే ఎలుకలు ఒత్తిడికి లోనవుతాయి. వాటిలో ఓ రకమైన హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనలో పేర్కొన్నారు..
అరటిపండ్ల వాసనలో N-పెంటైల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం కారణంగా, ఎలుకలో ఉద్రిక్తత ఏర్పడుతుందని వారు తేల్చారు.
అరటిపండ్ల నుంచి ఎలుకలు పారిపోతాయని పరిశోధనలో రుజువైనప్పటికీ.. పారిపోయేది మాత్రం మగ ఎలుకలు మాత్రమే అని వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అరటిపండ్లలో ఉండే ఆ కెమికల్ సమ్మేళనం ఆడ ఎలుకల మూత్రం నుంచి వచ్చే వాసన ఓకేలా ఉంటుందట. మగ ఎలుకల నుంచి తమ పిల్లలను దూరంగా ఉంచడానికి ఆడ ఎలుకలు తమ మూత్రంలో ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంటాయి. ఈ రసాయనం మగ ఎలుకలో ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ వాసనను చూసిన వెంటనే మగ ఎలుకలు తీవ్ర ఒత్తిడికి గురై…. ఆ వాసన వచ్చిన పరిసరాల్లో అస్సలు వెళ్లకుండా జాగ్రత్త పడుతాయి. అంతే కాదు పారిపోతాయట..
అయితే ఆడ ఎలుకలు అరటి పండ్లను అమితంగా ఇష్టపడతాయట. క్యూబెక్‌లోని మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ క్రేజీ విషయాన్ని కనుగొన్నారు. అధ్యయనం సమయంలో మగ ఎలుకలలో ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. మగ ఎలుకలు గర్భిణీ లేదా పాలిచ్చే ఆడ ఎలుకలకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే గర్భిణీ ఎలుకల మూత్రంలో ఉండే ఎన్-పెంటైల్ అసిటేట్ వల్ల మగ ఎలుకలు సమస్యలకు గురవుతాయి. గర్భిణీ లేదా పాలిచ్చే ఎలుక మూత్రం వాసన మగ ఎలుకలలో ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అవి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఎలుకలకు కూడా ఇష్టాఇష్టాలు ఉంటాయి.. వాటికి నచ్చని వాసన, నచ్చిన వాసన ఉంటుందంటే భలే విడ్డూరంగా ఉంది కదూ..!