ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత రమేష్ చేసిన ఆసభయంకర కామెంట్స్ కు నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ యూత్ నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి పై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు.
పోలీస్ లు, రాష్ట్రం ప్రభుత్వం కలసి చేసిన దాడి ఇది అని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. కాబట్టి ఈ ఘటన పై పోలీస్ లు చర్యలు తీసుకోక పోతే ఊరుకునేది లేదు. గుండాలు, రౌడీలతో దాడులు చేయించారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఈ దాడి. ప్రభుత్వం ఉంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు. ఈ దాడిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటాం. ఇది పోలీస్ ల వైఫల్యం కాదు.. వాళ్ళే దాడి చేయించారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఈ దాడికి బాధ్యత వహించాలి అని కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.