మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. గంజాయిని కొందరు విడిగా అమ్ముతుంటే మరికొందరు పోలీసులకు అనుమానం రాకుండా చాక్లెట్ల రూపంలో అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ గంజాయి చాక్లెట్లను చిన్న పిల్లలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. కాలేజీ అమ్మాయిలు సహా అబ్బాయిలకు సహా గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ మహానగరంలో గంజాయి చాక్లెట్ వినియోగం పెరిగింది. తాజాగా బిహార్ రాష్ట్రం దర్బాంగ ప్రాంతానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. పక్కా సమాచారం మేరకు అతని ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. అనంతరం అతని నుంచి 85 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు చున్ చున్ ఉపేందర్ మండల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.