KATHI MAHESH : టాలీవుడ్ లో మరో విషాదం.. కత్తి మహేష్ మృతి

-

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటులను  కోల్పోయినా చిత్ర పరిశ్రమ…. తాజాగా సినీ విమ‌ర్శకుడు, న‌టుడు అయిన క‌త్తి మ‌హేశ్‌ ను కోల్పోయింది. కాసేపటి క్రితమే క‌త్తి మ‌హేశ్‌ మృతి చెందారు. యాక్సిడెంట్ లో తలకు బలమైన గాయాలతో ఆస్పత్రి పాలైన కత్తి మహేష్.. ఇవాళ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.


కాగా.. ఆయన మృతి పట్ల పలుగురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇది ఇలా ఉండగా..  చెన్నై-కలకత్తా రహదారిపై గత నెల 26 శనివారం తెల్లవారు జామున.. కత్తి మహేష్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయ‌న్ను పోలీసులు నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version