తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. అందుకే అలా..?

-

కత్రినా కైఫ్ ఎట్టకేలకు తాను ప్రేమించిన వ్యక్తి.. ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ తో వివాహం చేసుకొని ఒక ఇంటిది అయిపోయింది అయితే తాజాగా భర్తతో కలిసి వినాయకుడి గుడిలో పూజలు చేసిన ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు రకరకాలుగా ఈమెను ట్రోల్ చేస్తుంటే.. మరి కొంతమంది ఈమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ అలాగే అత్త వీణా కౌశల్ తో కలిసి ముంబైలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ జంట గుడిలో దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేయడంతో అభిమానులు ఆమెను విమర్శిస్తున్నారు. గుడికి వచ్చినప్పుడు నుదిట పై బొట్టు పెట్టుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేదా అంటూ కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కత్రినా కైఫ్ ముఖంలో ఉన్న కళ చూస్తుంటే ఆమె ప్రెగ్నెంట్ గా అనిపిస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఆమె ప్రెగ్నెంట్ అంటూ ఇలాంటి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అందులో నిజం లేకపోయింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

ఇకపోతే కత్రినా కైఫ్ సిద్ధి వినాయకుడి ఆలయానికి ఒక భారతీయ మహిళల తలపై దుపట్టా ధరించి వచ్చినప్పుడు ఆమె యొక్క సింప్లిసిటీకి ఇంకొంతమంది అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈసారి కత్రినాకైఫ్ గ్రీన్ చుడీదార్ లో కనిపించగా.. విక్కీ కౌశల్ వైట్ షర్ట్ లో లో కనిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version