కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాన అనుచరులతో రసహ్యంగా భేటీ అయిన కల్వకుంట్ల కవిత… తన భవిష్యత్తుపై చర్చించే ఛాన్సు ఉంది. ఇప్పటికే నిన్న సాయంత్రం జాగృతి సోషల్ మీడియా ప్రతి నిధులతో సమావేశం అయ్యారు కల్వకుంట్ల కవిత.

అటు ఇవాళ కల్వకుంట్ల కవితను కలుస్తున్నారట కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని నాయకులను తనతో పాటు ప్రయాణం చేయాలని కోరారట కల్వకుంట్ల కవిత. ఉద్యమ సమయంలో ఆక్టివ్ గా పని చేసిన ఉద్యమ కారులను జాగృతిలో చేరాలని కవిత కోరనున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత కలవనున్ననట్లు సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందించే ఛాన్సు ఉంది.