ఇదేనా మోదీ సర్కార్ మనకు చెప్పిన మంచి రోజులు : కవిత

-

ట్విట్టర్ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. డాలర్ తో పోలిస్తే అత్యంత గరిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ చేరడంతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కవిత. తీవ్రస్థాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని.. 7.83 శాతానికి నిరుద్యోగం చేరిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర వెయ్యికి చేరిందన్న కవిత.. ఇదేనా మోదీ సర్కార్ మనకు చెప్పిన మంచి రోజులు కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.

రామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై కూడా టీఆర్ఎస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని కవిత ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి చిల్లర, మతపరమైన రాజకీయాలు చేస్తుందని ఆమె ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version