కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ వరుస ఆరోపణలు చేస్తోంది అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు లో కరప్షన్ జరిగిందని చెప్పింది. తాజాగా 2014 నుండి 23 వరకు సీఎం బీఆర్ఎస్ నిధులు భారీగా దుర్వినియోగమైనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించింది.
2018 లో ముందస్తు ఎన్నికలకి ముందు అప్పటి ఎమ్మెల్యేల దగ్గర అనుచరులకి నియోజకవర్గానికి 20 మంది చొప్పున మెడికల్ బిల్లులు లేకుండా పది నుండి 15 లక్షలు వరకు చెక్కులు అందించినట్లు సర్కార్ గుర్తించింది. మొత్తం 200 కోట్ల నిధులు గోల్మాల్ అయినట్లు అధికారులు చెప్తున్నారు ఈ అంశంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ఎంక్వయిరీ ని కూడా స్టార్ట్ చేసింది.