‘దంగల్’ స్టార్ సుహానీ భట్నాగర్‌ మృతికి కారణమైన ‘డెర్మాటోమైయోసిటిస్’ అంటే ఏమిటి

-

బాలీవుడ్ నటి సుహానీ భట్నాగర్ మరణవార్త మీరు వినే ఉంటారు.. సుహాని మృతికి అరుదైన వ్యాధి కారణమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన వ్యాధి డెర్మటోమయోసిటిస్‌తో సుహాని బాధపడ్డారని సుహాని తల్లి తెలిపారు. 19 ఏళ్ల వయసులోనే సుహానీ ఆకస్మికంగా మరణించింది. అమీర్ ఖాన్ దంగల్‌ సినిమాలో బబితా కుమారి ఫోగట్ పాత్ర పోషించినందుకు సుహాని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఇంతలోనే చనిపోయింది.

రెండు నెలల క్రితమే తన కుమార్తెలో లక్షణాలు కనిపించాయని, అయితే 10 నెలల క్రితమే తన కుమార్తె డెర్మటోమయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సుహానిలో కనిపించే మొదటి లక్షణం ఆమె చేతుల్లో నీరు. తరువాత ఆ నీరు శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించింది. డెర్మాటోమైయోసిటిస్ అంటే ఏమిటి? ఇది అంత డేంజరా..?

డెర్మాటోమైయోసిటిస్ అంటే ఏమిటి?

ఇది కండరాల బలహీనత, చర్మంపై దద్దుర్లు కలిగించే అరుదైన శోథ వ్యాధి. ఈ అరుదైన వ్యాధి ఇతర కండరాల వ్యాధుల నుంచి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది కండరాల వాపు మరియు చర్మంపై దద్దుర్లు కలిగిస్తుంది. కండరాల బలహీనత, కండరాల నొప్పి, శరీర ద్రవం, వాపు, ఊదారంగు లేదా ఎరుపు రంగు చర్మం, దురద మరియు మింగడం కష్టంగా ఉండటం డెర్మాటోమైయోసిటిస్ యొక్క లక్షణాలు. చర్మం రంగు మారడం సాధారణంగా ముఖం, కనురెప్పలు, మోకాలు ఛాతీపై కనిపిస్తుంది. ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు. ఈ వ్యాధి ప్రపంచంలో కేవలం నలుగురైదుగురిలో మాత్రమే కనిపిస్తుంది. పాపం సుహానీ ఈ వ్యాధితో మరణించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version