దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి ఎక్కువగా నెలకొంది. రాజ్యసభకు ఎవరు వెళ్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఎక్కువగా నెలకొంది. రాజ్యసభ సీట్ల కోసం బలమైన నేతలు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డియే బలం పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో అధికార పార్టీల బలం పెరిగే అవకాశం ఉంది. తెరాస రెండు స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎవరు రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం ఉందనే చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణా విషయం చూస్తే, ఇద్దరి పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. మాజీ ఎంపీలు కవిత, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్లు వినపడుతున్నాయి. అయితే ఇక్కడ బిజెపి జోక్యం చేసుకుని ఒక వ్యాపారవేత్తను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.
ఆ వ్యాపారవేత్తను తెరాస నుంచి పంపాలని బిజెపి భావించింది. ఈ మేరకు కెసిఆర్ ని కూడా సంప్రదించింది బిజెపి. దీనికి ఆయన ససేమీరా అన్నట్టు సమాచారం. దానికి తోడు ఒక ముస్లిం నాయకుడిని రాజ్యసభకు పంపిస్తాను అని చెప్పారట ఆయన. ఆయన ఎవరు అనేది ఇప్పటికి పేరు బయటకు రాకపోయినా కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని రాజ్యసభకు పంపే అవకాశం ఉందని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.