తెలంగాణకు కాంగ్రెస్సే మొదటి విలన్

-

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్సే మొదటి విలన్ అంటూ.. తెరాస అధినేత కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పోరాడి సాధించుకున్న తెలంగాణలో తెరాస పాలనను దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు.  గతంలో ఎన్నడు లేని విధంగా ఏ రాష్ట్రం చేయని విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 25 వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం. గత నాలుగేళ్లలో రాష్ట్రం 17.7 శాతం వృద్ధిని సాధించింది. దేశంలో ఏ రాష్ట్రం సాధించని పురోగతిని తెలంగాణ సాధిస్తోంది. నాటి ప్రభుత్వాల కాలంలో కరెంటు కోసం పరిశ్రమల యజమానులు, రైతులు రోడ్లపైకి వచ్చారు. నేడు అలాంటి పరిస్థితి లేదు. 2014లో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలతో పాటు అదనంగా మరో 71 సంక్షేమ కార్యక్రమాలను తెరాస చేపట్టింది. రైతులను ఆదుకునేందుకు ఎన్నడు ముందుకురాని కాంగ్రెస్ నేడు రైతుల పట్ల కపట ప్రేమను కనబర్చుతోంది. రాష్ట్రానికి నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్సే విలన్.

నాడు 1956లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ నుంచి నేటి సోనియాగాంధీ వరకు అందరూ తెలంగాణను వారి స్వలాభం కోసమే వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ భిక్షమేస్తే తెలంగాణను తెచ్చుకోలేదు.

రాష్ట్ర పురోగతిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న అడ్డగోలు ఆరోపణల వల్ల రాష్ట్ర ప్రగతి మసకబారుతోంది. అందుకే ప్రజా క్షేత్రంలో తేల్చుకుని సత్తా చాటుదాం అంటూ నేడు ఎన్నికల బరిలోకి దిగాను.

వివిధ సర్వేల అనంతరం దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి ఈ ఎన్నికల్లో సీట్లు కేటాయించాం.. అంటూ పేర్కొంటూ 105 మంది అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. కొన్నిచోట్ల కాస్త క్లారిటీ రావాల్సిన కారణంగా పేర్లను ప్రకటించలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version