గీతా గోవిందం 402 సెంటర్స్ లో రికార్డ్

-

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా గీతా గోవిందం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న వచ్చి సూపర్ హిట్ కొట్టింది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా నేటి తో 25 రోజులు పూర్తి చేసుకుంది.

అంతేకాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో 402 థియేటర్స్ లో గీతా గోవిందం 25 రోజులు ఆడి ఈమధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకు సాధ్యం కాని రికార్డ్ సృష్టించింది. అర్జున్ రెడ్డి సినిమాతో యువతలో సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో మరో లెవల్ కు వెళ్లాడని చెప్పొచ్చు. ఈమధ్య కాలంలో ఈ రేంజ్ లో ఇన్ని సెంటర్స్ లో రికార్డ్ క్రియేట్ చేయడం మాములు విషయం కాదు. ఈ సినిమా ఇంకా చాలా చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఫైనల్ కలక్షన్స్ ఎంత అన్నది వెళ్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version