దంచి కొడుతున్న ఎండలు..బయటకు వెళ్లొద్దని వైద్యశాఖ హెచ్చరిక

-

ఎండా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని… మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దని వైద్య శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. అత్యవసరం అయితే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలి. లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

నల్లటి దుస్తులు వేసుకోవద్దు. తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుందని.. ఫ్లూయిడ్స్ కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోండని సూచనలు చేసింది. ఎండదెబ్బె లక్షణాలు.. చెమట పట్టకపోవడం, గొంతు ఎండిపోవడం, అత్యంత నీరసం, తలనొప్పి, గుండెదడ, మూత్రం రాకపోవడం ఉంటుందని వెల్లడించింది. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని.. ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్ళు, జర్నలిస్టులు, ఎక్కువగా తిరిగే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

ఓఆరేస్ ప్యాకెట్లు అంగన్ వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విరివిగా అందుబాటులో పెట్టామని..డ్రింకింగ్ వాటర్ కలుషితం కాకుండా చూసుకోవాలని కోరింది. ఈ కాలంలో ఫుడ్, వాటర్ ఎక్కువగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉందని.. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించిందని స్పష్టం చేసింది. కోవిడ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉంది. 20పైగా జిల్లాల్లో సున్నా కేసులు నమోదు అవుతున్నాయని.. జిహెచ్ఎంసిలో 20 వరకు కోవిడ్ కేసుల సంఖ్య ఉంటుందన్నారు. కరోన ఆంక్షలు కేంద్రం పూర్తిగా తొలగించింది. రాష్ట్రంలో మాస్క్, భౌతిక దూరం పాటించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version