తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు : క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌!

-

తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అయితే.. ఈ కార్య వర్గ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మనం ముందస్తుకు వెళ్లడం లేదని… మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని పార్టీ నేతలతో చెప్పారు సీఎం కేసీఆర్‌.

KCR-TRS

ఇంకా మన పార్టీకి రెండేళ్లు ఉందని.. అన్ని అభివృద్ధి పనులను ఆ గడువులోగా చేసుకుందామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయండని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండాలని.. మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌ పార్టీనే గెలుస్తున్నామని..ఈ నెల 27 హుజురాబాద్ లో ఎన్నికల ప్రచార సభకు తాను వస్తానని ప్రకటించారు. హుజురాబాద్‌ నియోజక వర్గంలో సర్వేలన్ని టీఆర్‌ఎస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version