వందకు వంద శాతం దేశాన్ని బాగు చేస్తా…: సీఎం కేసీఆర్

-

దేశాన్ని వందకు వంద శాతం బాగు చేస్తా అని.. చివరి రక్తపు బొట్టు ధారపోసైనా సరే దేశాని గాడిలో పెడుతా అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకు సాగుతున్నామని కేసీఆర్ అన్నారు. దేశానికి మార్గదర్శకం చేసే విధంగా తెలంగాణ మారిందన్నారు. భారత దేశమే అద్బుతమై, ఆశ్చర్యం పోయేలా తెలంగాణ తయారైందన్నారు. ఈ దేశం కూడా దారి తప్పిపోతుందని.. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుందని.. వంద శాతం దేశంలో ఉన్నం కాబట్టి దేశం చెడిపోనీయకుండా చేయాలని అన్నారు. కర్ణాటకలో దిక్కుమాలిన మత కల్లోలాలు రేపారని ఆయన విమర్శించారు. నేను జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ముందుకు సాగుతున్నా అని కేసీఆర్ అన్నారు. దేశాన్ని సక్రమంగా చేసేందుకు నేను పని చేస్తా అని కేసీఆర్ అన్నారు.

బెంగుళూర్ తరువాత, ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని.. పూణే మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో రైతులు నష్టానికి భూములు అమ్మడం లేరని.. మన రాష్ట్రంలో ఎకరాకు రూ.20 లక్షల దాకా భూముల రేట్లు పెరిగాయని అన్నారు. భారత దేశంలో అతి తక్కువ నిరుద్యోగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన అన్నారు. కరెంట్ 24 గంటలు ఇస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రంలో కూడా ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలి. కులాలు మతాల పేరుతో చిచ్చు పెడితేనే పెట్టుబడులు, పరిశ్రమలు రావని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version