టిఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త : సీఎం కేసీఆర్

-

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన ప్రకటన చేశారు. దేశంలో మార్పు కోసం రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ తో కలసి పని చేస్తున్నామని కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రశాంత్ కిశోర్ తో మాట్లాడుతున్నాం… నాకు 7 ఎనిమిది ఏళ్లుగా పీకేతో స్నేహం ఉందని చెప్పారు. డబ్బుల కోసం పీకే ఎప్పుడు పని చేయరు… ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోమని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

వ‌రి ధాన్యం కొనుగోలు విషయంలో వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రంతో పోరాడ‌టానికి సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే కేంద్రం ప్ర‌భుత్వం చేసే.. ఈడీ, సీబీఐ దాడుల‌కు భ‌య‌ప‌డం అని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఈడీ ల‌కు బోడీ ల‌కు కేసీఆర్ భ‌య‌ప‌డ‌డ‌ని అన్నారు. స్కాంలు, దొంగ‌త‌నాలు చేసే వాళ్లుకు ఈడీ, సీబీఐ అంటే భ‌యం అన్నారు. రైతుల కోసం పోరాటం చేసు త‌మ‌కు భ‌యం లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version