మార్చి వరకు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల వారికి దళిత బంధు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత దళిత బంధును ఆపారని నవంబర్ 4 తర్వాత దళిత బందును ఇచ్చి తీరుతామని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఎవరు ఆపలేరని కేసిఆర్ కామెంట్ చేశారు. అదేవిధంగా దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆంధ్ర వాళ్ళు కూడా దళిత బంధు పథకం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హుజరాబాద్ లో తన సభకు అనుమతి ఇవ్వడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఇలా జరగలేదని తాను సీనియర్ నేతను అని దేశంలో ఓ ముఖ్యమంత్రిని అని కేసీఆర్ ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజరాబాద్ లో తాను సభను నిర్వహించక పోయినా అంతకంటే ఎక్కువ లాభం జరుగుతుందని హుజురాబాద్లో గెలిచి తీరుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావు లాంటి నాయకులు హుజురాబాద్ ప్రచారం లో ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.