తెలంగాణాలో ప్రస్తుతం కేసీఆర్ అధ్యక్షతన BRS పార్టీ అధికారంలో ఉంది, ఇంతకు ముందు TRS గా ఉన్న పార్టీ పేరును కాస్త జాతీయ స్థాయిలో రాజకీయాలను సాగించడానికి మార్చుకున్నారు. ఈ మధ్యనే దేశ రాజధాని ఢిల్లీ లోనూ పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. ఇక కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా తెలంగాణాలో లో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో వెలువడిన ఫలితాల కారణంగా వెంటనే కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు గద్దె దించారు. కాగా ఇప్పుడు అధికారంలో ఉన్న BRS ను కూడా గద్దె దించుతారా అన్న భయంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ లో కర్ణాటక ఫలితాల టెన్షన్.. సడెన్ మీటింగ్ !
-