Ram Gopal Varma: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఎలాంటి వివాదం లేకపోతే తానే ఓ వివాదాన్ని రాజేసి ఆ వివాదంతో ఉచితంగా ప్రచారాన్ని పొందుతుంటారు. ఇలా ఎప్పటికప్పుడు సంచలనాలకు మారుపేరుగా నిలిచే వర్మ ఇప్పుడు మరో సంచలనానికి తెర తీశారు. తాజాగా ఆర్జీవీ దృష్టి తెలంగాణ రాజకీయాల పడింది. తెలంగాణ రాజకీయాల్లో హట్ టాఫిక్ గా ఉన్నా.. హుజురాబాద్ ఎన్నికలను టార్గెట్ చేశాడు.
ఈ ఎన్నికల పరిణామ క్రమాన్ని బేస్ చేసుకుని ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సెన్సేషనల్ ప్రకటన చేశారు. ఈ చిత్రానికి వెన్నుపోటు ఈటలు అనే టైటిల్ తో మూవీ చేయబోతున్నట్టు తెలిపారు. బీజేపీ నేత ఈటల రాజేందర్, ఆయన టీఆర్ఎస్ కు ఎందుకు రాజీనామా చేశాడు. సీఎం కేసీఆర్ కి ఆయనకు మధ్య వివాదాలు రావడానికి గల కారణాలేంటీ .. ఎవరికి ఎవరూ వెన్నుపోటు పొడిచారనేది ఈ సినిమా కథనం అంటున్నారు.
ఈటల-కేసీఆర్ ఎపిసోడ్ ని చంద్రబాబు-ఎన్టీఆర్ ఎపిసోడ్ తో పోల్చారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి ఎలా వెన్నుపోటు పొడిచి పదవి ఎలా సొంతం చేసుకున్నారో… ఇప్పుడు ఈటల కూడా అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తున్నారని తెలిపారు. అందుకే కేసీఆర్- ఈటల వెన్నుపోటు ఈటలు అనే టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలను ఆ సినిమాలో వర్మ చూపించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల హీట్ కొనసాగుతుండగా.. ఆర్జీవీ ఈ సినిమాను ప్రకటించడంతో రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక హుజురాబాద్ ఎన్నికలకు ముందు ఈటలె రాజేందర్ ఇమేజ్ డామేజ్ చేసేదా? లేదా సీఎం కేసీఆర్ ఇమేజ్ కు నష్టం వాటిల్లుతుందా? ఈ చిత్రంలో ఈటల, కేసీఆర్ లలో ఎవరి క్యారెక్టర్ ని విలన్ ని చేస్తాడో అనేది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.