కేంద్రంపై కేసీఆర్ పోరాటం…ఆ ఒక్క లాజిక్ తేడా కొడుతుంది?

-

కేంద్రం ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటం మొదలుపెట్టారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై కేసీఆర్, బీజేపీల మధ్య పెద్ద రచ్చ నడుస్తున్న విషయం తెల్సిందే. పంజాబ్‌లో ధాన్యం కొన్నట్లు తెలంగాణలో కూడా కొనాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీల మాదిరిగా సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నాలు చేయడం కాస్త వింతగానే ఉంది. అంటే దీని వెనుక పెద్ద కారణమే ఉన్నట్లు కనిపిస్తోంది.

kcr

ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఎదుగుతుంది. ఆ పార్టీని దెబ్బకొట్టాలని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి..అందుకే ఇప్పుడు కేసీఆర్ దూకుడు పెంచారు. ధాన్యం అంశంపై ఇప్పటికే పలు రకాల వాదోపవాదాలు నడిచాయి. పైగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు ఒకసారి మద్ధతు ఇస్తూ మాట్లాడి…మరొకసారి అవి వేస్ట్ చట్టాలని కేసీఆర్ మాట్లాడారు. వరి వేస్తే ఉరే అని ఇక్కడ అంటారు…కేంద్రం ధాన్యం కొనాల్సిందే అనే బీజేపీపై ఫైర్ అవుతారు.

ఇక ధర్నా చౌక్‌ని బంద్ చేయించిన కేసీఆర్ ఇప్పుడు అక్కడే ధర్నాకు దిగారు. కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని, కేంద్రానికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినామని, ఇది ఈ రోజుతో ఆగేది లేదని… దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని కేసీఆర్ మాట్లాడారు. అయితే ధాన్యం అంశంపై మొదట క్లారిటీ ఇవ్వాల్సిందే కేసీఆర్..కానీ రాజకీయంగా దెబ్బకొట్టడానికి బీజేపీని టార్గెట్ చేశారు.

అయితే ఇక్కడ కేసీఆర్ ఒక లాజిక్ మిస్ అయినట్లే కనిపిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదొక పోరాటం చేస్తూనే ఉన్నాయి…ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాయి. కానీ వాటిని ఎప్పుడు కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో కేంద్రంపై యుద్ధం అంటే…ఢిల్లీలో ఉన్న కేంద్రం పట్టించుకునే పరిస్తితి ఉంటుందా? అనేది డౌట్. అంటే ఇదంతా రాజకీయంగా చేస్తున్న పోరాటాలని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version