బీజేపీపై కేసిఆర్ ఫైర్.. బీజేపీ బ్లాక్ మెయిల్ కు భయపడతానా ?

-

బీజేపీపై తెలంగాణా సీఎం కేసిఆర్ ఫైర్ అయ్యారు. బలం లేకున్నా అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తోక్కుతోందన్న ఆయన మహారాష్ట్రలోనూ బీజేపీ అలా ప్రయత్నించి భoగపడ్డదని అన్నారు. చావు నోట్లో తలపెట్టిన వాన్ని బీజేపీ బ్లాక్ మెయిల్ కు భయపడతానా ? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు లొంగక పోయినా బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో పబ్బం గడుపుకుంటోందని ఆయన అన్నారు.

పని తక్కువ… ప్రచారం ఎక్కువ అనే కాన్సెప్ట్ తోనే కేంద్రం మనుగడ సాగిస్తోందని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలలో దొడ్డిదారిన అయినా అధికారాన్ని లాక్కోవాలని చూస్తోందని ఆయన అన్నారు. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకే విద్యుత్‌ వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని కేసీఆర్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులతో ప్రగతిభవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వారందరికీ దిశా నిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version