దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు.. ఇచ్చారా..? : మంత్రి కోమటిరెడ్డి

-

గవర్నర్ ప్రసంగం చాట్ జీపీటీ AI వాడి తయారు చేశారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ మానుకోవాలి. మూసుకొని కూర్చొండి అని పేర్కొన్నారు. అలాగే అసెంబ్లీలో ఎతుల వెంకటయ్య, నాలుగు బర్రెల కథ చెప్పారు. వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జగదీశ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

గౌరవ సభ్యులు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ.. మేనిఫెస్టో కంటే ముందు పార్టీకి పెట్టిన హామీల్లో గానీ అధికారంలోకి వచ్చే సరికి దాదాపు 10లక్షల సార్లు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోతే నా మెడమీద తల ఉండదు అన్నారు. నువ్వు ఇంప్లీమెంట్ చేశావా..? అని ప్రశ్నించారు. ఆకరికి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా.. బోరు వేస్తా, మోటార్ ఇస్తా.. ఒకటిన్నర ఉంటే ఒకటిన్నర యాడ్ చేస్తానని చెప్పావు. దళితుడిని ధనవంతుడిని చేస్తానన్నావు. చేశావా..? అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశావు. దళిత వ్యతిరేకి అని నిరూపించుకున్నావు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానంటివి. డబుల్ బెడ్ రూం, మీ బిడ్డ, అల్లుడు వచ్చి యాడ పడుకుంటారు.. లక్ష అబద్దాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు ప్రశ్నిస్తారా..? కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version