చినజీయర్ స్వామికి.. కేసీఆర్ తక్కువ ధరకే భూమి ఇచ్చారా..?

-

చినజీయర్ స్వామి అంటే కేసీఆర్ కు ఎంత భక్తివిశ్వాసాలో అందరికీ తెలిసిందే.. ఒకానొక దశలో కేసీఆర్ తన సీఎం సీట్లో కూడా చినజీయర్ ను కూర్చోబెట్టారంటూ అప్పట్లో కొన్ని ఫోటోలు హల్ చల్ చేశాయిఆయన కనిపిస్తే కేసీఆర్ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేస్తారుయాదాద్రి వంటి ఆలయాన్ని పునర్నిర్మించే విషయం సహా అనేక విషయాల్లో కేసీఆర్ చినజీయర్ స్వామి సలహాలుసూచనల మేరకే ముందుకు వెళ్తుంటారు.

అలాంటి చినజీయర్ స్వామికి కేసీఆర్ ఆర్థికంగా లబ్ది చేకూర్చే పని చేశారా.. ప్రభుత్వ భూమిని కారు చౌక ధరకే కట్టబెట్టారా.. అవునంటూ ఓ ఫిర్యాదిదారు హైకోర్టును ఆశ్రయించాడుతెలంగాణ ప్రభుత్వం జీయర్ ట్రస్టుకు భూమి కేటాయించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందిజీయర్‌ ఇంటిగ్రేటెడ్‌ వేదిక్‌ అకాడమీ.. జీవా.. కి ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి సమీపంలో 2.30 ఎకరాల భూమిని కేటాయించింది.

ఈ భూమి కోసం చినజీయర్ స్వామి ట్రస్టు.. రూ.16.5 లక్షలు ప్రభుత్వానికి చెల్లించిందిఅయితే ఇది చాలా కారు చౌక ధర అంటూ సీహెచ్‌ వీరాచారి అనే స్థానికుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారువాస్తవానికి ఇప్పుడు అక్కడ మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమి విలువ రూ. 12 కోట్లకు పైమాటే అని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం చాలా తక్కువ ధరకు ఈ భూమి ఇచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో వీరాచారి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిదేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా చేర్చారుఈ వ్యాజ్యం బుధవారం సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చిందిఅయితే ఇదే కేసీఆర్ ప్రభుత్వం విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామికి చెందిన ఓ ధార్మిక సంస్థకు ఉచితంగా భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయిదానిపై పాపం.. ఎవరూ కోర్టుకు వెళ్లినట్టులేరు.

Read more RELATED
Recommended to you

Latest news