హైదరాబాద్‌ ప్రజలకు KCR ప్రభుత్వం న్యూ ఇయర్‌‌ గిఫ్ట్‌

-

హైదరాబాద్‌ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చింది కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం. జనవరి మొదటి వారం నుంచి ఉచిత మంచి నీరు పథకం ప్రారంభం కానుంది. జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు మంచినీరు ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం. చీఫ్‌ సెక్రటరీతో పాటు జలమండలి అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ ఉచిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన విధివిధానాలను రెండ్రోజుల్లో తయారు చేయాల్సిందిగా ఆదేశించారు.

CM KCR

అలాగే, జనవరిలో డిసెంబర్‌ బిల్లుని బట్టి రాయితీ కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత మంచినీటి సరఫరా చేస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటి వినియోగం ఉచితంగా అందించనున్నారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో విధి విధానాలను తయారుచేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version