తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫామ్ హౌస్ లో… గులాబీ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ సమావేశానికి కేటీఆర్ కూడా వచ్చారు. కాలేశ్వరం నివేదిక పైన… కెసిఆర్ చర్చిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. కాళేశ్వరంపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు, రేపు ధర్నాలకు పిలుపునిచింది బీఆర్ఎస్ పార్టీ. మండల మరియు జిల్లా కేంద్రాల్లో నేడు, రేపు వివిధ రూపాల్లో నిరసన తెలుపనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ధర్నాలు,రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు ఇతర రూపాల్లో నిరసనలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఈ మేరకు పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపైన కుట్ర చేస్తున్నది.. తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలన్నారు.