కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవాలంటే లాక్ డౌన్ ను కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తేల్చి చెప్పారు. అలా చేస్తే గాని పూర్తిగా దేశంలో కరోనా వైరస్ యొక్క ప్రభావం తగ్గిపోతుందని ఇది తన నిర్ణయం అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రధాన మోడీ ఈ విషయం గురించి మాట్లాడి అందరి ముఖ్యమంత్రులను ఒప్పించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే టైములో ప్రధాని గురించి, ఆయన కరోనా వైరస్ విషయంలో చూపిన చొరవ గురించి కేసీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. దేశ సమైక్యతను చాటే విధంగా ప్రధాని దీపాలు వెలిగించాలని కోరితే కొంతమంది విమర్శలు చేయడం కుసంస్కారానికి నిదర్శనం అని అభివర్ణించారు.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే అంతర్జాతీయ సంస్థ కూడా.. జూన్ 3 వరకూ లాక్ డౌన్ పొడిగించాలని నివేదిక ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. బోస్టన్ అంటే అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరున్న సంస్థ అని అటువంటి సంస్థ చెప్పింది కాబట్టి లాక్ డౌన్ కొనసాగిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలు జాతీయస్థాయిలో వైరల్ కావడంతో ప్రధాని మోడీ కూడా కేసీఆర్ ఐడియా కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని…పూర్తిగా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతే అప్పుడు లాక్ డౌన్ ఎత్తేయాలని అధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.