ఆ విష‌యంలో కేసీఆర్ ఇమేజ్ పెరుగుతోంద‌ట‌..

-

ఏండ్ల‌నాటి స్వ‌ప్నం అయిన తెలంగాణ సాకారం అయిన త‌ర్వాత అనేక మార్ప‌లు చోటుచేసుకుంటున్నాయ‌నే చెప్పాలి. కాగా మొద‌టి నుంచి తెలంగాణ ప‌రిస్థితి బాగానే ఉన్నా కూడా ఆ త‌ర్వాత కొంత మంద‌గించింది. ఎందుకుంటే అప్పుల కార‌ణంగా తెలంగాణ‌లో చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డ్డాయి. ఒక‌ప్పుడు మిగులు బ‌డ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆ త‌ర్వాత మాత్రం అప్పుల తెలంగాణ‌గా మారిపోయింది. ఇది కేసీఆర్ గ్రాఫ్‌ను చాలా దెబ్బ‌తీసింద‌నే చెప్పాలి, అయితే ఏపీలో పోలిస్తే మాత్రం తెలంగాణ‌లో ప‌రిస్థితి బాగానే ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే ఏపీ ప‌రిస్థితి తెలంగాణ కంటే కూడా అప్పుల విష‌యంలో చాలా దారుణంగా ఉంద‌నే చెప్పాలి. ఇక తెలంగాణ‌లో అయితే అప్పుల పాల‌వ్వ‌డం కొంత దెబ్బ‌తీసే అంశ‌మే అయినా కూడా క్ర‌మ క్ర‌మంగా కూడా ఆదాయ‌మేమీ పెర‌గ‌లేదు. కానీ మ‌న రాష్ట్రంలో వృద్ధి రేటు మాత్రం క్ర‌మంగా పెర‌గ‌డం క‌లిసొచ్చే అంశం. వ్య‌వ‌సాయ ప‌రంగా చూసినా లేదంటే ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఇన్‌క‌మ్ ప‌రంగా చూసినా కొంత మేలు చేసే అంశ‌మే ఇది.

ఇది కేసీఆర్ కు రాజ‌కీయంగా బాగా క‌లిసి వ‌స్తున్న మ్యాట‌ర్‌. కాగా రీసెంట్ గా నీతి ఆయోగ్ కూడా రాష్ట్ర ప‌రిస్థితుల విష‌జ్ఞంలో అర్ధనీతి పేరుతో ఓ లిస్టును కూడా విడుద‌ల చేశారు. అయితే ఇది కాస్త కేసీఆర్‌కు చాలా ఫేవ‌ర్‌ గా ఉండ‌టం బాగా క‌లిసి వ‌స్తోంది. ఈ నివేదిక‌లో రెండు తెలుగు రాష్ట్రాల ఆదాయ‌లు, అలాగే వృద్ధిరేటు ఉన్నాయి. అయితే ఇందులో జీఎస్డీపీ పరంగా తెలంగాణ మ‌న దేశంలోనే ఏడో పెద్ద రాష్ట్రంగా మారింద‌ని నీతి అయోగ్ వివ‌రించింది. దీంతో దీన్ని ఆధారంగా చేసుకుని టీఆర్ఎస్ రాజ‌కీయంగా ప్ల‌స్ చేసుకునే అవ‌కాశంకూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version