కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నాడు.. నేనైతే వీళ్ళను ఎప్పుడో జైల్లో వేసేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో దాదాపు రూ.70లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోనే మొదటిసారిగా డయాలసిస్ సెంటర్ ను మర్రిగూడలో ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆసుపత్రికి అవసరం అయిన ఇతర పరికరాలను కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.