తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి కాసేపటి క్రితమే అసెంబ్లీకి బయలుదేరగా.. ఆయన వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.
కాగా, నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ సభకు వెళ్తున్నారు. నేడు బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం తర్వాత.. రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టాక సభను వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చ జరగనుంది. అయితే, ఈ సెషన్ మొత్తం కేసీఆర్ వస్తారా? లేదా? కేవలం గవర్నర్ ప్రసంగం వరకే ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది.